‘మహారాష్ట్రలో శవాల దుస్థితి ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మహారాష్ట్రలో శవాల దుస్థితిని వీడియోలో చూడవొచ్చు.
ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో మహారాష్ట్ర కి సంబంధించింది కాదు. వీడియోలోని ప్రదేశం సూరత్ లోని అశ్విని కుమార్ శ్మశానవాటిక. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని ఒకరు యూట్యూబ్ లో పోస్ట్ చేసి గుజరాత్ లోని సూరత్ నగరానికి సంబంధించింది అని రాసినట్టు తెలిసింది. వీడియో లోని ప్రదేశం సూరత్ లోని అశ్విని కుమార్ శ్మశానవాటిక అని ‘గుజరాత్ సమాచార్’ అనే వెబ్ సైట్ లో చూడవొచ్చు.
గూగుల్ మాప్స్ లో అశ్విని కుమార్ శ్మశానవాటిక (సూరత్) యొక్క ఫోటోలల్లో కూడా వీడియోలోని ప్రదేశం చూడవొచ్చు. అశ్విని కుమార్ శ్మశానవాటిక కి సంబంధించి ‘VTV Gujarati News and Beyond’ వారు పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.
మహారాష్ట్రలోని శ్మశానవాటికల్లో ఈ మధ్య శవాల దహనానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, ‘మహారాష్ట్రలో శవాల దుస్థితి’ అని పెట్టిన ఈ వీడియో నిజానికి సూరత్ (గుజరాత్)లో తీసినది.