Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో ఒక మహిళ పోలీసులతో గొడవ పడుతున్న వీడియోని భారత్‌లో జరిగిన సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తన కుటుంబ సభ్యులను పోలీసులు లైసెన్స్ అడిగారని ఒక ముస్లిం మహిళ పోలీసులపై అరుస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. “ఈ దేశం ఏమన్నా ధర్మసత్రం అని మిమ్ములను అడగక పోవటానికి” అని అంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారతదేశంలో ఒక ముస్లిం మహిళ లైసెన్స్ అడిగినందుకు పోలీసులపై అరవడం చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్ (నిజం): ఈ వీడియో బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటనది, వీడియోలో మనం బంగ్లాదేశ్ పోలీస్ యూనిఫాం వేసుకున్న ముగ్గురు పోలీసులను చూడవచ్చు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ అవుతున్న వీడియోలో ‘amarbanglaremati’ అనే వాటర్ మార్క్ ఉండడం గమనించి, తగిన కి వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, @amarbanglaremati అనే బంగ్లాదేశీ ఇన్స్టాగ్రామ్ అకౌంటులో వైరల్ వీడియో యొక్క ఒరిజినల్ వెర్షన్ దొరికింది (ఆర్కైవ్ లింక్). దీన్ని వాళ్లు 11 జనవరి 2025న అప్లోడ్ చేశారు.

https://www.instagram.com/amarbanglaremati/reel/DEsUiHLpweq/

ఈ పోస్ట్ యొక్క వివరణలో, ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది అని సూచిస్తూ ‘#bangladesh #bangladeshi’ అని రెండు హాష్‌టాగ్‌లు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం వీడియోలో ఉన్న లారీ పైన బంగ్లాదేశ్ జాతీయ జెండాని బట్టి నిర్ధారించుకోవచ్చు.

అలాగే, వీడియోలో ఉన్న పోలీసులు బంగ్లాదేశ్ పోలీస్ యూనిఫాం వేసుకుని ఉన్నారు. వారి యూనిఫాం కుడి చేతి పైన బంగ్లాదేశ్ పోలీస్ ఇన్సిజ్నియా పాచ్ ఉండటం మనం గమనించవచ్చు. వారి అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ పోలీస్ వారు పోస్ట్ చేసిన అనేక ఫోటోలలో వీడియోలలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఇదే ప్యాచ్ ఉంటుంది.

వీడియోలో కనిపిస్తున్న షాప్ బోర్డు ఉన్న బంగ్లా అక్షరాలు ఏంటి అని మేము బాంగ్లాదేశీ ఫ్యాక్ట్ చెకర్ తౌసిఫ్‌ను సంప్రదించాము. బోర్డు పైన ‘সাহেদ ব্যাটারী এন্ড সার্ভিসিং হাউজ’ అంటే ‘Shahed Battery and Servicing House” అని రాసి ఉంది అని. బోర్డులో ఈ షాపు బాంగ్లదెశ్‌లోని పాబ్నా (Pabna) జిల్లాలో అన్నట్లు రాసి ఉంది అని చెప్పాడు. ఈ ఆధారాలను బట్టి ఈ సంఘటన భారత్‌లో జరగలేదు అని మనకు స్పష్టం అవుతుంది.

అదనంగా, ఇటువంటి సంఘటన ఇటీవల మన దేశంలో ఏమైనా జరిగింది అని ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతుకగా, ఎలాంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు. అలాగే, వీడియో గురించి మరిన్ని వివరాల గురించి @amarbanglaremati ఇన్స్టాగ్రామ్ పేజీ వారిని మేము సంప్రదించాము. వారి స్పందన రాగానే, ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరిగా, బంగ్లాదేశ్‌లో ఒక మహిళ పోలీసులతో గొడవ పడుతున్న వీడియోని భారత్‌లో జరిగిన సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll