Fake News, Telugu
 

పూణేలో జరిగిన ఆక్సిడెంట్ వీడియోని గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై జరిగినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై ఆయిల్ ట్యాంకర్ ఫైర్, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్లైఓవర్ పై ఉన్న ఒక వాహనం నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఆయిల్ టాంకర్ నుండి మంటలు చెలరేగిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఫైర్ ఆక్సిడెంట్ చోటుచేసుకుంది పూణే నగరంలోని వార్జే బ్రిడ్జి ఫై, హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై కాదు. ఈ ఘటనకి సంబంధించిన వివరాలు తెలుపుతూ సైబారాబాద్ పోలీస్ వారు ట్వీట్ కూడా పెట్టారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కొంత మంది యూసర్లు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలని డిసెంబర్ 2020 మొదటి వారంలో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూణే-బెంగళూరు రహదారి పై ఉన్న వార్జే బ్రిడ్జి పై ఈ ప్రమాదం చోటుచేసుకునట్టు అందులో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ ఆక్సిడెంట్ కి సంబంధించి ‘Dainik Bhasker’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈ ఘటన 05 డిసెంబర్ 2020 నాడు చోటుచేసుకునట్టు ఆర్టికల్ లో తెలిపారు. పూణే-బెంగళూరు రహదారి పై ఉన్న వార్జే బ్రిడ్జి పై వెళ్తున్న ఒక ట్రక్కు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ఆర్టికల్ లో తెలిపారు.

ఈ ఆక్సిడెంట్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, సైబరాబాద్ పోలీస్ ఈ ఘటనకి సంబంధించిన వివరాలు తెలుపుతూ ఒక ట్వీట్ పెట్టారు. ఈ ఫైర్ ఆక్సిడెంట్ పూణే లోని వార్జే బ్రిడ్జి  పై జరిగిందని, హైదరాబాద్ నగరంలో అలాంటి ఘటనలు ఇటివల చోటుచేసుకోలేదని స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా, వీడియోలో కనిపిస్తున్న ఫైర్ ఆక్సిడెంట్ హైదరాబాద్ గచ్చిబౌలి పై చోటుచేసుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పూణే-బెంగళూరు రహదారి పై జరిగిన ఆక్సిడెంట్ వీడియోని గచ్చిబౌలి ప్లై ఓవరు పై ఆయిల్ ట్యాంకర్ ఫైర్ అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll