రాజస్థాన్ సిరిహోళిని గ్రామంలోని పిపాలేశ్వర్ దేవాలయానికి ఒక చిరుతపులి కుటుంబం రోజూ రాత్రిపూట వచ్చి ఆ ఆలయ పూజారి తో కలిసి నిద్రిస్తున్నాయి, అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వీడియోని అక్కడి అటవీశాఖ అధికారులు తీసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాజస్తాన్ పిపాలేశ్వర్ ఆలయ పూజారితో కలిసి చిరుత పులి కుటుంబం నిద్రిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో సౌత్ ఆఫ్రికా దేశంలోని ఒక బ్రీడింగ్ సెంటర్ లో తీసినది, రాజస్తాన్ ఆలయంలో తీసినది కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్నది Dolph C. Volker అనే ఒక జంతు సంరక్షుడు. ఈ వీడియోకి రాజస్తాన్ లోని పిపాలేశ్వర్ ఆలయానికి ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
‘man sleeping alongside cheetahs’ అనే కి పదాలతో గూగుల్ లో వెతికినప్పుడు, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని Dolph C. Volker అనే యూసర్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. జంతు సంరక్షుడిగా పనిచేస్తున్న Dolph C. Volker ఈ వీడియోని 21 జనవరి 2019 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. సౌత్ ఆఫ్రికా బ్రీడింగ్ సెంటర్ లో పెరిగిన చిరుత పులులతో తాను గడిపిన క్షణాలంటూ ఈ వీడియో వివరణలో Dolph C. Volker తెలిపారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘News 18’ న్యూస్ వెబ్ సైట్ 11 జూన్ 2020 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. Dolph C. Volker అనే జంతు సంరక్షుడు సౌత్ఆఫ్రికా బ్రీడింగ్ సెంటర్ లోని చిరుత పులులతో ఒక రాత్రి గడిపినప్పుడు తీసిన వీడియో అని ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
2018లో సౌత్ఆఫ్రికా లో జరిపిన “The Cheetah Experience” ఎక్స్పరిమెంట్ లో భాగంగా తీసిన వీడియోనే ఇదని ఒక యూసర్ తమ ట్వీట్ లో పేర్కొన్నారు.
అమెరికా దేశానికి చెందిన Dolph C. Volker గురించి, ఆఫ్రికా దేశంలో జరిగిన “The Cheetah Experience” ప్రాజెక్ట్ గురించి తెలుపుతూ చాలా న్యూస్ వెబ్ సైట్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసారు. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, చిరుతపులుల సముహంతో ఒక మనిషి నిద్రిస్తున్న ఈ వీడియో ఆఫ్రికా దేశంలో తీసినది, భారత దేశంలో తీసినది కాదు.