Fact Check, Fake News, Telugu
 

ఉత్తర ప్రదేశ్ లో 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూల్ ఫీజు 20 వేల రూపాయ‌లు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ ర‌ద్దు అన్న వార్తలో నిజం లేదు.

0

ఉత్తర ప్రదేశ్ లో 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చు అన్నీ కలిపి 20 వేల రూపాయ‌లు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్డినెన్స్ జారీచేసారని చేప్తున్న వార్త నిజమో కాదో తెలపమని మా వాట్సాప్ కి ఒక అభ్యర్థన వచ్చింది. ఇదే వార్త కొన్ని సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, దీనికి సంబంధించిన పోస్టులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్ లో 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చు అన్నీ కలిపి 20 వేల రూపాయ‌లు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్డినెన్స్ జారీచేసారు.

ఫాక్ట్(నిజం): ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2018లో విడుదల చేసిన ‘U.P. Self-Financed Independent Schools (Fee Regulation) Act, 2018’ అనే ఆర్డినెన్సు ప్రకారం వార్షిక ఫీజు 20,000 కంటే ఎక్కువ ఉన్న స్కూల్స్ అన్నీ వాళ్ళ సదుపాయాలకు తగ్గట్టు ఫీజు వసూలు చెయ్యొచ్చు అని స్పష్టంగా చెప్పింది. ఇంకా ఈ ఆర్డినెన్సు లో ఎక్కడ కూడా వార్షిక ఫీజు 20 వేల రూపాయ‌లు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ ర‌ద్దు చేస్తారన్న ప్రస్తావన లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ పోస్టులో చెప్పిన ఆర్డినెన్సు కోసం వెతకగా 2018లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం “U.P. Self-Financed Independent Schools (Fee Regulation) Act, 2018 ” అనే ఆర్డినెన్సు జారి చేసింది. ఈ ఆర్డినెన్సు ప్రకారం, వార్షిక ఫీజు 20,000 కంటే ఎక్కువ ఉన్న స్కూల్స్ అన్ని వాళ్ళ సదుపాయాలకు తగ్గట్టు ఫీజు వసూలు  చెయ్యొచ్చు. ఒక జిల్లా స్థాయి ‘ఫీ రెగ్యులేటరీ కమిటీకి’ తమ ప్రతిపాదనలు సమర్పించి తమ సదుపాయాల ప్రకారం ఫీజు వసూలు చెయ్యొచ్చు అన్నది ఈ ఆర్డినెన్సు సారాంశం. ప్రతి ఏడాది ఫీజు ఎంత పెంచుకోవొచ్చో కూడా ఈ ఆర్డినెన్సు లో కూలంకషంగా చెప్పడం జరిగింది. అంతేకాని ఈ ఆర్డినెన్సు లో ఎక్కడ కూడా వార్షిక ఫీజు 20 వేల రూపాయ‌లు దాటితే విద్యా సంస్థ లైసెన్స్ ర‌ద్దు చేస్తారన్న ప్రస్తావన లేదు. ఈ ఆర్డినెన్సు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దిన్నిబట్టి పోస్ట్ లో చెప్పింది తప్పు అని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఉత్తర ప్రదేశ్ లో వార్షిక ఫీజు 20,000 కంటే ఎక్కువ ఉన్న స్కూల్స్ అన్ని వాళ్ళ సదుపాయాలకు తగ్గట్టు ఫీజు వసూలు  చెయ్యొచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll