Fake News, Telugu
 

ఎండాకాలంలో పిల్లలను స్కూల్‌కు రప్పించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్ యాజమాన్యం ఇలా క్లాస్‌రూమ్‌ను స్విమ్మింగ్ పూల్‌గా మార్చేసారు

0

క్లాస్‌రూమ్‌ నీటితో నిండిపోయి ఉండి, అందులో పిల్లలు ఆడుకుంటూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్‌లోకి వరద నీరు వచ్చిందంటూ, అక్కడి ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు (ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్‌లోకి వరద నీరు చేరడంతో, అక్కడి పిల్లలు నీటిలో ఆడుకుంటున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఎండా కాలంలో పిల్లలు స్కూల్‌కు రావడం తగ్గించడంతో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ క్లాస్‌రూమ్‌ను ఇలా స్విమ్మింగ్ పూల్‌గా మార్చి పిల్లలను అందులో ఆడిపించింది. ఈ ఘటన ఏప్రిల్ 2024లో జరిగింది. వరద నీరు క్లాస్‌రూమ్‌లోకి వచ్చాయి అన్న వాదనలో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వీడియోలో చూపిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్ క్లాస్‌రూమ్‌లో పిల్లలు నీటిలో ఆడుకుంటున్న విషయం నిజమే అయినప్పటికీ, అవి వరద నీరు కాదు. ఆ స్కూల్ టీచర్స్ క్లాస్‌రూమ్‌లో నీళ్లు నింపి పిల్లలని అందులో ఆడించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించి సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వీడియోను ఏప్రిల్ 2024లో రిపోర్ట్ చేసిన అనేక వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో జరిగింది. ఎండా కాలంలో పిల్లలు స్కూల్‌కు  రావడం తగ్గించడంతో ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ క్లాస్‌రూమ్‌ను ఇలా స్విమ్మింగ్ పూల్‌గా మార్చి పిల్లలను అందులో ఆడిపించింది.  అప్పట్లో ఈ వీడియో వైరల్ అవడంతో అన్ని ప్రధాన వార్తా సంస్థలు ఈ వీడియోను రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ వార్తా కథనాలు కేవలం ఎండాకాలంలో పిల్లలను స్కూల్‌కు రప్పించడానికే ఇలా చేసినట్టు రిపోర్ట్ చేసాయే తప్ప వరద నీరు క్లాస్ రూమ్‌లోకి రావడంతో ఇలా జరిగిందని రిపోర్ట్ చేయలేదు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని తెలిపాడు. దీన్నిబట్టి వైరల్ పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, ఎండాకాలంలో పిల్లలను స్కూల్‌కు రప్పించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్ యాజమాన్యం ఇలా క్లాస్‌రూమ్‌ను స్విమ్మింగ్ పూల్‌గా మార్చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll