Fake News, Telugu
 

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ ‘వందేమాతరం తెలుగు’ అని సెషన్ ప్రారంభించలేదు; వందేమాతరం గీతాన్ని సంస్కృతంలో మాత్రమే పాడుతారు

0

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సెషన్లో  ప్రతిరోజు అసెంబ్లీ స్పీకర్ వందేమాతరం గీతాన్ని తెలుగులో పాడమని చెప్పినట్టు, తెలుగు రాష్ట్రాలలో ఏ రోజూ కూడా రాష్ట్ర గీతం లేదా జాతీయ గీతం పాడటం జరగదు అంటూ ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు, ఇందులో ఎంత వాస్తవం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సభలో ప్రతిరోజు అసెంబ్లీ స్పీకర్ వందేమాతరం తెలుగులో అని చెప్పి సెషన్ ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ సభలలో, ఏ రోజు కూడా రాష్ట్ర గీతం కానీ జాతీయ గీతం కానీ పాడడం జరగలేదు.

ఫాక్ట్ (నిజం): వందేమాతరం గీతం రచించిన అసలు భాష సంస్కృతం, కానీ బెంగాలీ లిపిలో రాయబడింది. ఈ గీతాన్ని మరొక భాషలో పాడడం అంటూ జరగదు, ఈ గీతం నేషనల్ సింబల్స్ లో ఒక అంశం. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే రోజున జాతీయ గీతాన్ని పాడి సెషన్ ప్రారంభించడం జరుగుతుంది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

ముందుగా, వైరల్ వీడియోలో పైన ఉన్న న్యూస్ ఛానల్ లోగోని బట్టి కీ వర్డ్ సెర్చ్ చేయగా  ఉత్తర్‌ప్రదేశ్‌ లోని పలు అసెంబ్లీ సమావేశాల వీడియోలు కనిపించాయి. వాటిని పరిశీలించగా వైరల్ పోస్ట్ కు సంబంధించిన పూర్తి వీడియోను కనుగొనడం జరిగింది. ఈ వీడియో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించింది.  ఈ వీడియో ద్వారా, స్పీకర్ ‘వందేమాతరం తెలుగులో’ అని కాకుండా ‘వందేమాతరం కెలిఏ’ అని అన్నట్టు స్పష్టం అయింది. మిగితా సెషన్ల వీడియోల ద్వారా, వందేమాతరం గీతం ప్రతి రోజు కాకుండా వర్షాకాలం సమావేశాలు (మొదటి రోజు మాత్రమే) ఈ గీతంతో ప్రారంభించినట్టు స్పష్టం అయింది.

వందేమాతరం గీతం బంకించంద్ర ఛటర్జీ సంస్కృతంలో స్వరపరిచారు. 24 జనవరి 1950న రాజ్యాంగ సభ దీనిని ‘జన గణ మన’తో సమాన హోదాను ప్రకటించింది. ఈ గీతానికి సంబంధించిన భాష గురించి వెతకగా, ఒక పోటీ పరీక్షకు సంబంధించిన కేసులో మద్రాస్ హై కోర్ట్ దీని గురించి స్పష్టం చేసిందని పలు వార్త పత్రికల (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా స్పష్టం అయింది. ఈ కేసులో  వందేమాతరం గీతాన్ని రచించిన అసలు భాష సంస్కృతం, కానీ బెంగాలీ లిపిలో రాయబడింది అని తమిళనాడు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేయడం జరిగింది. భారతదేశంలో విభిన్న భాషలతో సంబంధం లేకుండా అందరికి సహజంగా నేషనల్ సింబల్స్ వర్తిస్తాయి. వీటిలో వందేమాతరం కూడా ఒక అంశం. నేషనల్ సింబల్స్ అంశాల యొక్క  వివరాలు ఇక్కడ చూడండి.

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సభలలో రాష్ట్ర గీతం లేదా జాతీయ గీతం పాడరు అన్న క్లెయిమ్ క్లెయిమ్ గురించి వెతకగా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను  జాతీయ గీతం అయిన ‘జన గణ మన’తో  ప్రారంభిస్తారు అని స్పష్టం అయింది. దీనికి సంబంధించిన వీడియోలు  ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ ‘వందేమాతరం తెలుగు’ అని సెషన్ ప్రారంభించలేదు; వందేమాతరం గీతాన్ని సంస్కృతంలో మాత్రమే పాడుతారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే రోజున జాతీయ గీతాన్ని పాడి సెషన్ ప్రారంభించడం జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll