Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని ‘టోక్యో ఒలింపిక్స్ 2020’లో జిమ్నాస్టిక్ క్రీడాకారుల అధ్బుత విన్యాసాలని షేర్ చేస్తున్నారు

0

‘టోక్యో ఒలింపిక్స్ 2020’ క్రీడా పోటీలలో జిమ్నాస్టిక్ క్రీడాకారుల చేసిన అధ్బుత విన్యాసాల దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘టోక్యో ఒలింపిక్స్ 2020’ క్రీడా పోటీలలో జిమ్నాస్టిక్ క్రీడాకారుల చేసిన అధ్బుత విన్యాసాల దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. ఈ వీడియోలో కనిపిస్తున్నవి, ‘2018 Trampoline Gymnastics’ క్రీడా పోటీలలో భాగంగా జిమ్నాస్టిక్ క్రీడాకారులు చేసిన విన్యాసాల దృశ్యాలు. ఈ వీడియో ‘టోక్యో ఒలింపిక్స్ 2020’కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు జూన్ 2020 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. దీన్ని బట్టి, ఈ వీడియో జూలై 2021లో ప్రారంభమైన ‘టోక్యో ఒలింపిక్స్ 2020’కి సంబంధించింది కాదని చెప్పవచ్చు. ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని ఇంటర్నెట్‌లో చాలా సార్లు షేర్ చేసినట్టు తెలిసింది. 2018లో ఇవే దృశ్యాలు కలిగిన ఒక వీడియోని ‘2018 Trampoline Gymnastics | Tumbling | Moments’ అనే టైటిల్ తో యూట్యుబ్‌లో పబ్లిష్ చేసారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ‘2018 Trampoline Gymnastics World Championships’ క్రీడా పోటీలకు సంబంధించి షేర్ చేసిన వీడియోలలో పోస్టులో కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు కలిగి ఉన్నట్టు తెలిసింది. అయితే, పోస్టులో షేర్ చేసిన వీడియోని వేర్వేరు క్రీడా పోటీలకు సంబంధించిన దృశ్యాలని ఎడిట్ చేసి రూపొందించారు. ఆ క్రీడా పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, ప్రస్తుతం జపాన్ దేశంలో జరుగుతున్న ‘టోక్యో ఒలింపిక్స్ 2020’ క్రీడలకు సంబంధించింది కాదని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని వీడియోని ‘టోక్యో ఒలింపిక్స్ 2020’లో జిమ్నాస్టిక్ క్రీడాకారులు చేసిన అధ్బుత విన్యాసాల దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll