ఒక విలాసవంతమైన భవనానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఇవి ఒక ఆంధ్ర నాయకుడి ఇంటికి సంబంధించినవని సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.
క్లెయిమ్: ఒక ఆంధ్ర నాయకుడికి సంబంధించిన విలాసవంతమైన ఇంటి ఫోటోలు.
ఫాక్ట్(నిజం): ఈ పోస్టులో ఉన్నవి ఫోటోలు వేరు వేరు సంబంధంలేని ఫోటోలు. వీటిలో ఒకటి ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియాకు సంబంధించినది అయితే, ఇంకోటి అమెరికాలోని బ్రూక్లిన్లో ఉన్న ఒక ఖరీదైన ఇంటిది. కొన్ని ఫోటోలు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటులలోనివి. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోలని నుండి ఒక్కో ఫోటోను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇవన్నీ ఒక ఇంటికి సంబంధించినవి కావని, ఒక్కో దానికి మరోదానితో సంబంధం లేదని తెలిసింది. ఆంధ్రాలో ఉన్న ఒక నాయకుడి విలాసవంతమైన ఇంటికి సంబంధించిన ఫోటోలు ఇవి అని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవు.
వీటిల్లో కొన్ని ఫోటోల గురుంచి వివరాలు చూద్దాం.
ఈ ఫోటో అమెరికాలో ఉన్న బ్రూక్లిన్లోని ఒక ఖరీదైన ఇంటికి సంబంధించినది. 2012లోని nydailynews వెబ్సైటులో ఈ ఇంటి గురించి ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లో ఉన్న ఒక ఫొటోలో ఈ ఇంటి మెట్లను చూడచ్చు, ఇవి అచ్చం వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్న మెట్లను పోలి ఉన్నాయి. అంతే కాకుండా రెడ్డిట్‌లో కూడా nydailynews వారు ఈ ఇంటి ఫోటోను పోస్టు చేసారు.
ఈ గది యొక్క ఫోటో, భారతదేశములో ధనికుల్లో ఒకడైన ముకేశ్ అంబానీ గృహం ఆంటిలియాది. ది సన్ వెబ్సైటులో ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లో ఈ ఫోటోను చూడొచ్చు.
ఇది అమెరికాలోని ది పాలజ్జో హోటల్ యొక్క ఇంటీరియర్ యొక్క ఫోటో, ఈ హోటల్ లాస్ వేగాస్ నగరంలో ఉంది. ఈ ఫోటోను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అంతే కాకుండా, ట్రిప్ అడ్వైసర్ వెబ్సైటులో ఉన్న ఈ హోటల్ యొక్క ఇదే భాగానికి సంబంధించిన వేరే యాంగిల్లో తీసిన ఫోటో ఇక్కడ చూడచ్చు.
ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటులలో ఉన్న ఫోటోలు
పోస్టులో ఉన్న ఈ ఫోటో మరియు ఈ ఫోటో వేరు వేరు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటులలో లభించాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, సంబంధంలేని ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఆంధ్ర నాయకుడికి సంబంధించిన విలాసవంతమైన ఇంటి ఫోటోలని క్లెయిమ్ చేస్తున్నారు.