చైనాలోని వివిధ ప్రాంతాల్లో 20 జూన్ 2025 నుంచి వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో, దీనికి సంబంధించిన దృశ్యాలంటూ కొన్ని వీడియో క్లిప్పులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ వీడియోల్లో వరద ఉధృతికి భవనాలు కూలిపోవడం, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జూన్ 2025లో చైనాలో వచ్చిన వరదలకు సంబంధించిన వీడియోలు.
ఫాక్ట్: వైరల్ వీడియోలోని కొన్ని దృశ్యాలు జూన్ 2025లో చైనాలో వచ్చిన వరదలకు చూపుతున్నప్పటికీ, మిగతా వీడియో క్లిప్పులు గతంలో జపాన్, భారత్, టర్కీ వంటి దేశాలలో వచ్చిన వరదలకు సంబంధించినవి. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియోలోని మొదటి క్లిప్‌ని రివర్స్ ఇమేజ్ చేయగా, ఇది 2021లో జపాన్‌లోని అటామీ నగరంలో కొండచరియలు విరిగిపడుతున్నప్పుడు తీసిన వీడియో అని తెలిసింది. ఇదే వీడియోని 2024లో కూడా ఇటలీ వరదలకు షేర్ చేసినప్పుడు మేము రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.
ఇక రెండో క్లిప్ టర్కీ రాజధాని అంకారాలో జూన్ 2023లో (ఇక్కడ & ఇక్కడ) వచ్చిన భారీ వర్షానికి భవనం నుంచి నీరు బయటికి వస్తున్న దృశ్యాలను చూపుతుంది.

అలాగే, వరద ప్రవాహానికి షాపులు కొట్టుకుపోవడాన్ని చూపుతున్న వీడియో క్లిప్ 2023లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదలకు సంబంధించినది. దీనికి సంబంధిన ఫాక్ట్- చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు. అయితే, వైరల్ వీడియోలోని కొన్ని దృశ్యాలను జూన్ 2025లో చైనాకి సంబంధించినవిగా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నాయి.
చివరిగా, సంబంధంలేని పాత వీడియోలను జూన్ 2025 చైనా వరదలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.