Fake News, Telugu
 

ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణించకూడదని UIDAI స్పష్టంగా తెలిపింది

0

ఇక నుండి ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా (జనన ధ్రువీకరణ) పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇదే విషయాన్ని UIDAI స్పష్టం చేస్తూ ఒక సర్క్యులర్ విడుదల చేసిందంటూ సంస్థ డైరెక్టర్ పేరుతో డిసెంబర్ 2023లో విడుదల చేసిన సర్క్యులర్‌ను కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్త/ సర్క్యులర్‌కు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇక నుండి ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫాక్ట్(నిజం): ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణించవద్దని UIDAI జారీ చేసిన సర్క్యులర్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఆధార్‌ను కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌గా మరియు అడ్రస్ ప్రూఫ్‌గా మాత్రమే పరిగణించాలని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా కాదని UIDAI స్పష్టంగా తెలిపింది. గతంలో అనేక కోర్టులు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్నది ఇదే అంశంపై స్పష్టతనిస్తూ UIDAI డైరెక్టర్‌ 2023 డిసెంబర్‌లో AUA/KUA కేంద్రాలకు పంపించిన సర్క్యులర్‌.

AUA/KUA  కేంద్రాలు ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణిస్తున్నాయని, కానీ అలా పరిగణించకూడదని ఈ సర్క్యులర్‌ సారాంశం. 2018లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండం ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, పలు హైకోర్టులు కూడా వివిధ సందర్భాలలో ఇదే పునరుద్ఘాటించాయని కూడా ఈ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఐతే ఈ సర్క్యులర్‌లో చెప్పిన విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణిస్తున్నారని షేర్ చేస్తున్నారు. సాధరణంగా, ఆధార్ నమోదుకు సంబంధించి ఏయే పత్రాలను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణిస్తారో అన్న వివరాలు ఇక్కడ చూడొచ్చు.

ఇటీవల బొంబాయి హైకోర్టుతో పాటు గతంలో అనేక కోర్టులు ఆధార్‌ను జనన ధ్రువీకరణగా పరిగణించకూడదని చెప్పిన తీర్పులకు సంబంధించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇదిలా ఉండగా ఇటీవల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్‌ను పరిగణించబోమని స్పష్టం చేసింది. UIDAI ఆదేశాల అనుసారమే ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌ డాక్యుమెంట్‌ల లిస్టు నుండి తొలగించామని EPFO స్పష్టం చేసింది. ఆధార్‌ను కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌గా మరియు అడ్రస్ ప్రూఫ్‌గా మాత్రమే పరిగణించాలని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా కాదని UIDAI స్పష్టం చేసింది. దీన్నిబట్టి పోస్టులో షేర్ చేసిన వార్త నిజం కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పరిగణించకూడదని UIDAI స్పష్టంగా తెలిపింది.

Share.

About Author

Comments are closed.

scroll