Fake News, Telugu
 

ఈ ఫోటలో టెంట్ల కింద చికిత్సనందిస్తున్నది మహారాష్ట్రలో టైఫాయిడ్ తో భాదపడుతున్న వారికి, గుజరాత్ లో కరోనా పేషెంట్స్ కి కాదు

0

‘గుజరాత్ తాపి జిల్లాలో టెంట్ల కింద నేలపై కరోనా పేషెంట్స్ కి వైద్యం అందిస్తున్నారని’ చెప్తూ కొందరు పేషెంట్స్ చేతికి సెలైన్ బాటిల్స్ తో నేలపై పడుకున్న ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గుజరాత్ తాపి జిల్లాలో టెంట్ల కింద నేలపై కరోనా పేషెంట్స్ కి వైద్యం అందిస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో గుజరాత్ – మహారాష్ట్ర సరిహద్దులోని రెండు రాష్ట్రాలకు చెందిన పలు గ్రామాల్లో టైఫాయిడ్ తో బాధపడుతున్న పేషెంట్స్ కి  సరిహద్దులో మహారాష్ట్ర వైపున్న గ్రామమైన శివపూర్ లో ఇలా టెంట్ల కింద చికిత్సనందిస్తున్న సంఘటనకి సంబంధించింది. హాస్పిటల్ లో బెడ్స్ అన్ని కరోనా పేషెంట్స్ తో నిండిపోవడంతో ఇలా టెంట్స్ కింద చికిత్స నందించారు. ఈ ఫోటోకి గుజరాత్ లో కరోనా చికిత్స కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన యూట్యూబ్ లోని ఒక మరాఠీ న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో ప్రకారం ఈ విజువల్స్ మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులో మహారాష్ట్ర వైపున ఉన్న గ్రామాలలో టైఫాయిడ్ తో భాదపడుతున్న పేషెంట్స్ కి అందిస్తున్న చికిత్సకి సంబంధించినవి.

యూట్యూబ్ వీడియో ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులోని ఫోటోలో ఉన్న విధంగానే పేషెంట్స్ నేలపై చికిత్స పొందుతున్న ఫోటోలు ప్రచురించిన ఒక హిందీ వార్తా కథనం మాకు కనిపించింది. ఐతే ఈ కథనం ప్రకారం హాస్పిటల్ బెడ్స్ కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోవడంతో మహారాష్ట్ర – గుజరాత్ సరిహద్దులోని 10-12 గ్రామాలలో టైఫాయిడ్ తో బాధపడుతున్న వారికి ఇలా టెంట్ల కింద చికిత్సనందిస్తున్నారు.

గూగుల్ సెర్చ్ ద్వారా పోస్టులోని ఫోటోని ప్రచురించిన ఒక గుజరాతీ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం గుజరాత్ – మహారాష్ట్ర సరిహద్దులోని రెండు రాష్ట్రాలకు చెందిన పలు గ్రామాల్లో టైఫాయిడ్ తో బాధపడుతున్న పేషెంట్స్ కి సరిహద్దులో మహారాష్ట్ర వైపున్న గ్రామమైన శివపూర్ లో ఇలా టెంట్ల కింద చికిత్స నందిస్తున్నారు. ఈ ఫోటోలు ఆ సంఘటనకి సంబంధించినవే. దీన్నిబట్టి, పోస్టులోని ఫోటో ఉన్నది టైఫాయిడ్ చికిత్స పొందుతున్న వారని, కరోనా చికిత్స పొందుతున్న వారు కాదని, పైగా ఈ చికిత్స మహారాష్ట్ర లోని సరిహద్దు గ్రామంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

చివరగా, ఈ ఫోటోలో టెంట్ల కింద చికిత్సనందిస్తున్నది మహారాష్ట్రలో టైఫాయిడ్ తో బాధపడుతున్న పేషెంట్స్ కి, గుజరాత్ లో కరోనా పేషెంట్స్ కి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll