Fake News, Telugu
 

ప్రణబ్ ముఖర్జీ మరణంపై హర్షం వ్యక్తం చేస్తూ జర్నలిస్ట్ రానా ఆయుబ్ ట్వీట్ చేయలేదు

0

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో అఫ్జల్ గురు ఆత్మకు శాంతి చేకురింది అంటూ జర్నలిస్ట్ రానా ఆయుబ్ ట్వీట్ చేసిందని చెప్తూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017లో రాష్ట్రపతిగా సేవలందిస్తున్న ప్రణబ్ ముఖర్జీ, అఫ్జల్ గురు క్షమాభిక్ష అప్పీల్ ను తిరస్కరించారు. అయితే ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

   ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో అఫ్జల్ గురు ఆత్మకు శాంతి చేకురింది అంటూ జర్నలిస్ట్ రానా ఆయుబ్ ట్వీట్ చేసింది

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసిన ఆ ట్వీట్ ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేసింది. ట్విట్టర్ లో పేట్టే సాదారణ ట్వీట్ కు పోస్టులో షేర్ చేసిన ఈ ట్వీట్ కు చాలా తేడాలు ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ట్వీట్ కోసం జర్నలిస్ట్ రానా అయుబ్ ట్విట్టర్ అకౌంట్లో వెతకగా, అలాంటి ట్వీట్ ఏది తన అకౌంట్లో పోస్ట్ చేయలేదు అని తెలిసింది. పోస్టులో చూపిస్తున్న ఆ ట్వీట్ కి, సాదారణంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసే ట్వీట్ కు చాలా తేడాలు కనిపించాయి. పోస్టులో షేర్ చేసిన ఆ ట్వీట్లో తేది మరియు సమయం లేవు. అలాగే, ట్వీట్లో షేర్ చేసిన ఫోటో సాధారణంగా ట్వీట్లో ఉండే అలైన్మెంట్ కి భిన్నంగా పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఆధారాలతో పోస్టులో షేర్ చేసిన ట్వీట్ ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం ఈ ట్వీట్ కి 200కి పైగా కామెంట్స్ వచ్చాయి.ఒకవేళ అసలు ట్వీట్ డిలీట్ చేసిన కూడా, ఆ కామెంట్స్ మాత్రం డిలీట్ కావు. కానీ ఎక్కడ కూడా మాకు ఆ కామెంట్స్ కనబడలేదు.

పోస్టులో షేర్ చేసిన ఆ ట్వీట్ ఫోటోషాప్ ద్వార ఎడిట్ చేయబడినది అని జర్నలిస్ట్ రానా ఆయుబ్ తన ట్వీట్ల ద్వార స్పష్టం చేసింది. ఆ ట్వీట్లని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ప్రణబ్ ముఖర్జీ మరణంతో అఫ్జల్ గురు ఆత్మకి శాంతి చేకూరుతుంది అని రానా అయూబ్ ట్వీట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll