‘బీజింగ్ సైనిక ఆస్పత్రులు నిండాయి, రోజంతా అంత్యక్రియల గృహాల్లో మృతదేహాలను దహనం చేస్తున్నారు అని చెప్తున్నాడు’ అని ఉన్న ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ హాస్పిటల్స్ అలా నిండడానికి కారణం భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో గాయపడిన చైనా సైనికుల వలన అన్న నేపథ్యంలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీజింగ్ లోని మిలిటరీ హాస్పిటల్స్ భారత జవాన్ల చేతిలో మరణించిన మరియు గాయపడిన చైనా సైనికుల వలన నిండిపోయింది.
ఫాక్ట్ (నిజం): ): స్క్రీన్ షాట్ లోని కథనం లో బీజింగ్ లోని మిలిటరీ హాస్పిటల్స్ నిండింది అక్కడ తాజాగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల వలన అని ఉంది. ఆ కథనం లో ఎక్కడా కూడా భారత్ మరియు చైనా కి మధ్యలో జరుగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించలేదు. కావున పోస్టులో క్లెయిమ్ తప్పుద్రోవ పట్టించేదిలా ఉంది.
స్క్రీన్ షాట్ లోని ట్వీట్ కోసం ‘@Jenniferatnd’ ట్విట్టర్ అకౌంట్ లొ వెతికినప్పుడు, ఆ ట్వీట్ లభించింది. ఆ ట్వీట్ లో ఉన్న కథనాన్ని చదివినప్పుడు, అందులో బీజింగ్ లో కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల వల్ల అక్కడి మిలిటరీ హాస్పిటల్స్ నిండిపోయాయని, అక్కడి అంత్యక్రియల గృహాల్లో రోజంతా మృతదేహాలను దహనం చేస్తున్నారని ఒక స్థానికుడు చెప్తున్నట్లుగా ఉంది. ఆ కథనంలో ఎక్కడా కూడా భారత్ మరియు చైనా కి జరుగుతున్న ఘర్షణ ల గురించి ప్రస్తావించలేదు.
15 జూన్ 2020 న భారత్ మరియు చైనా సైన్యాల మధ్య గాల్వాన్ వ్యాలీ లో ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణ కి సంబంధించి సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, బీజింగ్ లోని మిలిటరీ హాస్పిటల్స్ నిండింది అక్కడ తాజాగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల వలన అని స్క్రీన్ షాట్ లోని కథనం లో ఉంది.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?