ఒక అమ్మాయిని ఒక మహిళా పోలీసు తీసుకుని వెళ్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, ఆ అమ్మాయి తనను రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులను చంపినందుకు గాను పోలీసులు అరెస్టు చేశారని, ఆమె చేసింది కరెక్ట్ అని, అందుకు ఏకీభవిస్తారా లేదా అంటూ అడుగుతూ ఒక పోస్టు పెట్టారు. ఆ ఫోటో గురించి చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : తనను రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులను చంపిన అమ్మాయి.
ఫాక్ట్ (నిజం): ఒక కుట్రలో భాగంగా ఆ అమ్మాయి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తనకు కాబోయే భర్తని చంపినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అలాంటి ఫోటోనే ‘Bangalore Mirror’ వారు ఒక అంశం మీద ప్రచురించిన కథనం లో లభించింది. ఆ కథనం ద్వారా అరెస్ట్ అయిన మహిళ పేరు ‘శుభ శంకర్ నారాయన్’ అని, ఒక కుట్రలో భాగంగా ఆమె మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తనకు కాబోయే భర్త అయిన ‘గిరీష్’ అనే వ్యక్తిని చంపినందుకు పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారని తెలిసింది.
అదే విషయాన్ని వెల్లడిస్తూ ‘The Hindu’ వారు ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చదవవచ్చు. పోస్టులో పెట్టిన ఫోటో లో , ‘The Hindu’ ఆర్టికల్ లోని ఫోటోలో తాను ఒకే డ్రెస్ వేసుకున్నట్టుగా చూడవొచ్చు. కావున ఫేస్బుక్ పోస్టులో చేసిన ఆరోపణ తప్పు.
చివరగా, ఆ అమ్మాయి ఒక కుట్రలో భాగంగా మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తనకు కాబోయే భర్తని చంపినందుకు గానూ పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?