Fake News, Telugu
 

రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో టీడీపీ జెండాలు పట్టుకొని వచ్చిన నాయకులను కాంగ్రెస్ శ్రేణులు కొట్టాయని షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్

0

రేవంత్ రెడ్డీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీ నాయకులు పచ్చ జెండాలు పట్టుకొని హల్ చల్ చేస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని కొట్టారు అని  ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనం అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమెంటో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రేవంత్ రెడ్డీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీ నాయకులు పచ్చ జెండాలు పట్టుకొని హల్చల్ చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని కొట్టారు అంటూ ‘Way2News’ ప్రచురించింది.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా తెలిపింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ పోస్టులో చెప్పిన విధంగా, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న ఎల్బీ స్టేడియంలో టీడీపీ నాయకులు పచ్చ జండాలు పట్టుకొని వస్తే కాంగ్రెస్ నాయకులు కొట్టడం జరిగిందా లేదా అని వెతికితే, ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదని తెలిసింది.

ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ ద్వారా ‘Way2News’ లో వెతికితే ఈ సంస్థ 10 ఆగష్టు 2023న “లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది.

పైగా, Way2News సంస్థ X పోస్టు ద్వారా  “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని నిర్ధారించటం  గమనించాం.

చివరిగా, రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో టీడీపీ జెండాలు పట్టుకొని వచ్చిన నాయకులను కాంగ్రెస్ శ్రేణులు కొట్టారని షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll