పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, సైనిక యూనిఫాంలో ఉన్న పలువురు ఓ వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “ఆర్మీ/రక్షణ దళాలు నిమగ్నమై ఉన్నపుడు వారి వాహనం ఏదైనా ఒక వాహనానికి తగిలితే స్థానిక బలం చూపిస్తూ అతిగా వేషాలేస్తే పరిణామం ఇలాగే ఉంటుంది/ఉండాలి” అని పేర్కొంటున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో ఇటీవలది అని పేర్కొంటూ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల ఏప్రిల్/మే 2025లో, ఒక ఆర్మీ వాహనం స్థానిక కాశ్మీరీ వాహనాన్ని ఢీకొట్టగా, అక్కడి స్థానికులు భారత జవాన్లతో ఘర్షణ పడ్డారు, దీంతో సైనికులు వారిని కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వైరల్ వీడియో ఆగస్టు 2022 నాటిది. వార్త కథనాల ప్రకారం, 22 ఆగస్టు 2022న శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగామ్ చౌక్ వద్ద యూనిఫాంలో ఉన్న కొంతమంది సైనిక సిబ్బంది ఒక పౌరుడిని కొట్టిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 323, 341 కింద ఎఫ్‌ఐఆర్ (FIR no-116/2022) నమోదు చేయబడింది. ఆర్మీ జవాన్లు ఆ వ్యక్తని ఎందుకు కొట్టారని మేము స్వతంత్రంగా ధృవీకరించలేము. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ఆగస్టు 2022లో ప్రచురితమైన పలు వార్త కథనాల లభించాయి (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఈ ఘటన ఆగస్టు 2022లో శ్రీనగర్‌లోని నౌగామ్ చౌక్ ప్రాంతంలో జరిగింది. దీన్ని బట్టి ఈ వీడియో ఇటీవలది కాదని మనం నిర్ధారించవచ్చు.

వార్త కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), 22 ఆగస్టు 2022న శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగామ్ చౌక్ వద్ద యూనిఫాంలో ఉన్న కొంతమంది సైనిక సిబ్బంది ఒక పౌరుడిని కొట్టారు.“ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే, నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 323, 341 కింద ఎఫ్‌ఐఆర్ (FIR no-116/2022) నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాము” అని పోలీసులు తెలిపినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ వీడియో యొక్క ప్రామాణికతను ఇండియన్ ఆర్మీ చెందిన చినార్ కార్ప్స్ పరిశీలిస్తోంది. ప్రాథమికంగా చూస్తే, ఇది పాత వీడియో అని, సాయుధ దళాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేసినట్లు కనిపిస్తోందని ఓ ఆర్మీ అధికారి పేర్కొనట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఆర్మీ జవాన్లు ఆ వ్యక్తని ఎందుకు కొట్టారని మేము స్వతంత్రంగా ధృవీకరించలేము. కానీ అందుబాటులో ఉన్న సమాచారం బట్టి ఈ వైరల్ వీడియో ఆగస్టు 2022 నాటిది అని స్పష్టంగా తెలుస్తుంది.

చివరగా, ఈ వైరల్ వీడియో ఆగస్టు 2022లో ఇండియన్ ఆర్మీ జవాన్లు శ్రీనగర్‌లోని నౌగామ్ చౌక్ వద్ద ఒక వ్యక్తిని కొట్టిన సంఘటనకు సంబంధించినది.