Fake News, Telugu
 

2011 ఫోటో పెట్టి, ‘జామియా విద్యార్థులపై పోలీస్ చర్య’ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

1

‘జామియా విద్యార్థులపై పోలీస్ చర్య’ అంటూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జామియా విద్యార్థులపై పోలీసులు చర్య తీసుకుంటున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని సంఘటన 2011 లో జరిగింది. ఫోటోలో పోలీసు కాళ్ళ కింద ఉన్నది ఆనంద్ బడౌరియా (సమాజ్ వాదీ పార్టీ లీడర్). ఆ ఫోటోకి, తాజాగా జరిగిన సంఘటనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ‘లల్లన్ టాప్’ వారు 2016 లో ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో అదే ఫోటో పెట్టి, DIG బూట్ల కింద ఆనంద్ ముఖం ఉన్న ఫోటో 2011 లో వార్తాపత్రికలు ప్రచురించినట్టుగా రాసారు. ఆనంద్ బడౌరియా సమాజ్ వాదీ (లోహ్య వాహిని) పార్టీ లీడర్ అని ఆర్టికల్ లో చదవొచ్చు.

ఆర్టికల్ లోని హిందీ పదాలతో గూగుల్ లో వెతకగా, అదే ఫోటోతో ‘Catch News’ వారు ప్రచురించిన ఆర్టికల్ దొరుకుతుంది. ఆ ఆర్టికల్ లో కూడా ఫోటో కింద ‘ డీకే ఠాకూర్ బూట్ల కింద బడౌరియా’ అని రాసి ఉంటుంది. ఆ ఫోటో తీసిన వ్యక్తి ప్రమోద్ అధికారి అని రాసి ఉంటుంది. తన గురించి వెతకగా, అతను ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ అని తెలుస్తుంది.

2011 ఫోటో కాబట్టి, టైం ఫిల్టర్ పెట్టి ఫోటోని గూగుల్ లో వెతకగా, 2011 లో ‘bhadas4media’ అనే వెబ్ సైట్ ప్రచురించిన ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో అదే ఫోటోతో కూడిన పేపర్ క్లిప్పింగ్ ఫోటోని చూడవొచ్చు. ఆ సంఘటన పై మరింత సమాచారం కోసం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, 2011 ఫోటో పెట్టి, ‘జామియా విద్యార్థులపై పోలీస్ చర్య’ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll