Deepfake, Fake News, Telugu
 

నిద్రిస్తున్న వ్యక్తిపై సింహం దాడి చేయకుండా వెళ్లిపోయినట్లు చూపిస్తున్న ఈ వీడియో AI ద్వారా రూపొందించబడినది

0

వీధిలో నిద్రపోతున్న ఒక వ్యక్తి వద్దకు సింహం వచ్చి అతన్ని వాసన చూసి ఏమీ చెయ్యకుండా వెళ్లిపోయిన దృశ్యాలను చూపుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇది నిజమైన ఘటనగా పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: వీధిలో నిద్రపోతున్న వ్యక్తి వద్దకు వచ్చిన సింహం అతనిపై దాడి చేయకుండా వెళ్లిపోతున్నట్లు చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్: ఇది Artificial Intelligence ఉపయోగించి రూపొందించిన వీడియో. నిజమైన ఘటన కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోని పరిశీలించగా అందులోని బోర్డుపై ఉన్న అక్షరాలు గుర్తించడానికి వీలులేని భాషలో ఉన్నట్లు చూడవచ్చు. Artificial Intelligence (కృత్రిమ మేధస్సు) సహాయంతో రూపొందించిన వీడియోలలో ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది.

ఇక వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియో (ఇక్కడ & ఇక్కడ) లభించింది. “గుజరాత్‌లో వీధిలో నిద్రిస్తున్న వ్యక్తిని సింహం కనుగొంది!!!” అనే టైటిల్‌తో బ్రెజిల్‌కు చెందిన ‘The world of Beasts’ అనే యూట్యూబ్ ఛానెల్లో 06 జూన్ 2025లో ఈ వీడియో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. అయితే, ఈ వీడియోని ఎడిట్ చేసినట్లు లేదా కృత్రిమంగా సృష్టించినట్లు వీడియో వివరణలో పేర్కొనబడింది. అలాగే, ఛానెల్ వివరణలో కూడా ఈ ఛానెల్లోని వీడియోలు AI సహాయంతో రూపొందించినవిగా పేర్కొన్నారు. ఈ ఛానెల్ వివిధ జంతువుల యొక్క AI వీడియోలను అప్లోడ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు.

A screenshot of a video chat  AI-generated content may be incorrect.

అదనంగా, వైరల్ వీడియోని వివిధ AI డిటెక్టర్ల (ఇక్కడ & ఇక్కడ) ద్వారా పరీక్షించగా, ఈ వీడియో AI ద్వారా రూపొందించినట్లు నిర్ధారించాయి.

A screenshot of a website  AI-generated content may be incorrect.

చివరిగా, నిద్రిస్తున్న వ్యక్తిపై సింహం దాడి చేయకుండా వెళ్లిపోయిందని ఒక AI వీడియోని నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll