Fake News, Telugu
 

‘తిరుమలలో అన్యమత ప్రచారం’ అని షేర్ చేయబడుతున్న ఈ వీడియో వైసీపీ ప్రభుత్వ సమయానికి చెందింది కాదు

0

వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లో హిందువుల మనోభావాలను కించపరుస్తూ తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నపాస్టర్లు’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లో తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న పాస్టర్ల వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో పాతది; 2013 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. 2013 నాటికి వైసీపీ ఇంకా అధికారంలోకి రాలేదు. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు పాస్టర్ సుధీర్. ఈ ఘటన పై 2014లో పోలీసులు కేసు నమోదు చేసి, పాస్టర్ సుధీర్ ని అరెస్ట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియోని సరిగ్గా చూస్తే, వీడియోలోని వ్యక్తి 2:39 సమయం దగ్గర తన పేరు పాస్టర్ సుధీర్ అని చెప్పినట్టు చూడవొచ్చు. కావున, కొన్ని కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, పోస్ట్ లోని వీడియో పై ‘టీవీ 5’ వారు టెలికాస్ట్ చేసిన కథనం ఒకటి దొరుకుంతుంది. ఆ వీడియోని ‘టీవీ 5’ వారు అక్టోబర్ 2014 లో యూట్యూబ్ లో పెట్టినట్టు చూడవొచ్చు.

అంతేకాదు, పోస్ట్ లో పెట్టిన వీడియోలోని వివిధ క్లిప్స్ ని ‘Sudhir Mondithoka’ అనే యూట్యూబ్ ఛానల్ సెప్టెంబర్ 2013 లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. 2013 నాటికి వైసీపీ ఇంకా అధికారంలోకి రాలేదు.

2014లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో, అధికారుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసి, వీడియోలోని పాస్టర్ సుధీర్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వీడియోలోని ఘటన పై మరింత సమాచారం కోసం ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. 

చివరగా, ‘తిరుమలలో అన్యమత ప్రచారం’ అని షేర్ చేయబడుతున్న ఈ వీడియో వైసీపీ ప్రభుత్వ సమయానికి చెందింది కాదు. 2013 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. 2013 నాటికి వైసీపీ ఇంకా అధికారంలోకి రాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll