Fake News, Telugu
 

మసీదు పై హనుమాన్ జెండా ఎగరవేసిన వీడియో రెండేళ్ల క్రితంది కాదు. తాజాగా ఢిల్లీ లో జరిగిన సంఘటనది

0

తాజాగా ఢిల్లీలోని ఒక మసీదు మినార్ పైకి కొందరు ఎక్కి, కాషాయం జెండా ఎగురవేస్తున్న వీడియో సోషల్ మీడియా లో చాలా వైరల్ అవుతుంది. అయితే, అది తాజాగా జరగలేదని, అది ఒక ఫేక్ న్యూస్ అని కొందరు పోస్ట్ చేస్తున్నారు. అది రెండేళ్ళ క్రితం బీహార్ లో జరిగిన ఘటన వీడియో అని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తాజాగా ఢిల్లీలో ఒక మసీదు మినార్ పై కాషాయం జెండా ఎగరవేయలేదు, అది రెండేళ్ల క్రితం వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక మసీదు పై తాజాగా కొందరు హనుమాన్ జెండా ఎగారవేసారు. అది పాత వీడియో కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ చేసిన ఫోటోలో ‘Rana Ayyub’ ట్వీట్ ఫోటో చూడవొచ్చు. అయితే, తను ట్వీట్ చేసిన వీడియో ఢిల్లీది కాదు అని కొందరు అనడంతో ఆ ట్వీట్ డిలీట్ చేసింది. కానీ, తను పెట్టిన వీడియో ఢిల్లీదే అని తను నిర్ధారణకు వచ్చానని చెప్తూ, మళ్ళీ ఆ వీడియోతో ఇంకో ట్వీట్ చేసింది.

ఆ మసీదు ఢిల్లీ లోని అశోక్ నగర్ లో ఉందని చెప్తూ ‘ది వైర్’ వార్త సంస్థ పోస్ట్ చేసిన మసీదు ఫోటోని ఇక్కడ చూడవొచ్చు (‘ది వైర్’ వారు ముందు ఆ మసీదు ఢిల్లీలోని ‘అశోక్ విహార్’ లో ఉందని రాసారు, కానీ తరువాత అది ‘అశోక్ నగర్’ లో ఉందని సరిచేసారు). ఆ ఫోటోని సరిగ్గా చూస్తే, ‘జై శ్రీ రామ్’ అనే హనుమాన్ జెండాని మసీదు పై ఎగరవేసినట్టు తెలుస్తుంది. ‘ది క్విన్ట్’ వార్తసంస్థ వారు ఢిల్లీలోని ఆ మసీదు దగ్గరికి వెళ్లి, మసీదుపై హనుమాన్ జెండా మరియు భారత జెండా ఉన్నట్టు చూపిస్తూ పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

కొందరు మాత్రం వీడియోలోని ఘటన తాజాగా జరగలేదని, రెండేళ్ళ క్రితం బీహార్ లోని సమస్తిపూర్ లో జరిగిందని పోస్ట్ చేస్తున్నారు. 2018 లో బీహార్ లోని సమస్తిపూర్ లో ఒక మసీదు పై హిందూవులు కాషాయం జెండా ఎగరవేసారని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కానీ, ఆ మసీదు మరియు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోని మసీదు వేరెవేరు అని కింద చూడవొచ్చు.

‘ANI’ ట్వీట్ ని పెట్టి, వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు చెప్పారని కొందరు అంటున్నారు. అయితే ఢిల్లీ పోలీసు వారు చెప్పింది ఢిల్లీ లోని ‘అశోక్ విహార్’ లో ఏమీ జరగలేదని (ముందు ఆ వీడియో ‘అశోక్ విహార్’ లో అయినట్టు వైరల్ అయ్యింది). కానీ, ఆ ఘటన జరిగింది ఢిల్లీ లోని ‘అశోక్ నగర్’లో.

చివరగా, ఢిల్లీ అశోక్ నగర్ లోని మసీదు పై తాజాగా కొందరు హనుమాన్ జెండా ఎగారవేసారు. అది పాత వీడియో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll