Fake News, Telugu
 

ఫొటోలో ఢిల్లీ బీజేపీ లీడర్ కపిల్ మిశ్రా తో ఉన్న వ్యక్తి మరియు ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఒకరు కాదు

1

ఢిల్లీ లోని జఫరాబాద్ లో ఫిబ్రవరి 24 న ఒక వ్యక్తి పిస్టల్ తో అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే, ఆ కాల్పులు జరిపిన వ్యక్తి షారుఖ్ అనే ముస్లిం అని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందనీ, వాస్తవానికి ఆ కాల్పులు జరిపింది ఫొటోలో ఢిల్లీ బీజేపీ లీడర్ కపిల్ మిశ్రా తో ఉన్న వ్యక్తి అని చెప్తూ, అతనికి సంబంధించిన ఫోటోను కొంతమంది ఫేస్బుక్ యూజర్స్ పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ‘షారుఖ్’ అనే ముస్లిం కాదు. ఆ కాల్పులు జరిపింది ఫొటోలో ఢిల్లీ బీజేపీ లీడర్ కపిల్ మిశ్రా తో ఉన్న వ్యక్తి. 

ఫాక్ట్ (నిజం): ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి మరియు పోస్టులో ఉన్న ఫోటో లో బీజేపీ లీడర్ కపిల్ మిశ్రా తో ఉన్న వ్యక్తి ఒకరు కాదు. కాల్పులు జరిపిన వ్యక్తి పేరు ‘మహమ్మద్ షారుఖ్’ మరియు కపిల్ మిశ్రాతో ఉన్న వ్యక్తి ‘రోహిత్ రాజ్ పుత్’. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

ఢిల్లీ లోని జఫరాబాద్ లో ఫిబ్రవరి 24 న ‘ఎర్ర రంగు చొక్కా మరియు నీలం రంగు ప్యాంటు’ వేసుకున్న వ్యక్తి పిస్టల్ తో అనేక రౌండ్లు కాల్పులు జరిపాడని ‘Hindustan Times’ కథనం ద్వారా తెలుస్తుంది. ఆ కథనంలో అతనికి సంబంధించిన ఫోటో కూడా ఉంటుంది. ‘ANI’ ట్వీట్ ద్వారా కాల్పులు జరిపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ‘మహమ్మద్ షారుఖ్’ గా గుర్తించినట్లు తెలుస్తుంది.

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను మూడు రోజుల్లో నిరసన క్షేత్రాల నుండి ఖాళీ చేయించాలని పోలీసులను ఉద్దేశించి కపిల్ మిశ్రా మాట్లాడిన వీడియోని ఇక్కడ  చూడవొచ్చు. పోస్టులో కపిల్ మిశ్రా మరియు అతని అనుచరులు ఉన్న ఫోటో యొక్క స్టిల్ ని ఆ వీడియో నుండి తీసుకున్నారు. ఫొటోలో కాల్పులు చేసినట్లుగా చెప్పబడుతున్న వ్యక్తిని మరియు ‘మహమ్మద్ షారుఖ్’ ని పోల్చి చూసినప్పుడు, వారు ఇద్దరు వేరు వేరు వ్యక్తులని స్పష్టంగా తెలుస్తుంది. ఆ రెండు ఫోటోల్లోని వ్యక్తుల జుట్టు, గడ్డం మరియు మొహం యొక్క ఆకారానికి సంబంధించిన తేడాలను గమనించవచ్చు. 

ఫొటోలో తనతో పాటు ఉన్న వ్యక్తి గురించి సమాచారం కోసం కపిల్ మిశ్రా ని BOOM వారు సంప్రదించినప్పుడు, అతను తన అనుచరుడు ‘రోహిత్ రాజ్ పుత్’ అని తెలిపాడు.‘రోహిత్ రాజ్ పుత్’ ఫేస్బుక్ ప్రొఫైల్ లోని ఫొటోతో ‘మహమ్మద్ షారుఖ్’ ఫోటోని పోల్చి చూసిన, ఇద్దరు వేరువేరే అని తెలుస్తుంది.

చివరగా, ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఫొటోలో ఢిల్లీ బీజేపీ లీడర్ కపిల్ మిశ్రా తో ఉన్న వ్యక్తి కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

1 Comment

scroll