Fake News, Telugu
 

ఈ వీడియోలో ట్రక్కు పై అయోధ్య రామ మందిరం ఫోటోలను ప్రదర్శిస్తున్నది సిడ్నీ (ఆస్ట్రేలియా) లో

0

ఇజ్రాయిల్ దేశంలో కూడా రాముని ప్రదర్శించినందుకు శతకోటి వందనాలు, ఇదే మోడీ గ్రాఫ్ అంటే’ అని చెప్తూ, ఒక ట్రక్కు పై అయోధ్య రామ మందిరం ఫోటోలను ప్రదర్శిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఇజ్రాయిల్ లో ట్రక్కు పై అయోధ్య రామ మందిరం ఫోటోలను ప్రదర్శిస్తున్నప్పుడు తీసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోని సిడ్నీ (ఆస్ట్రేలియా) లో తీసారు; ఇజ్రాయిల్ లో కాదు. సిడ్నీ లోని స్వామి నారాయణ మందిరం దగ్గర ఆ వీడియోని తీసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, రిజల్ట్స్ లో వీడియోకి సంబంధించి ఏమీ రాలేదు. వీడియోలో చుపెట్టినటువంటి అయోధ్య రామ మందిరం ప్రదర్శన వేరే దేశాల్లో ఎక్కడెక్కడ ప్రదర్శించారో అని వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో రెండు ప్రదేశాలు వచ్చాయి. ఒకటి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, మరొకటి బ్లాక్ టౌన్ సిటీ కౌన్సిల్, సిడ్నీ. పోస్ట్ లోని వీడియోలో ట్రక్కు పై ప్రదర్శించిన ఫోటోలనే సిడ్నీ వీడియోలో కూడా చూడవొచ్చు. అయితే, సిడ్నీ వీడియోలో ట్రక్కు లేదు.

సిడ్నీ ప్రదర్శన గురించి వెతకగా, ఆ ప్రదర్శన ని ‘హిందూ కౌన్సిల్ అఫ్ ఆస్ట్రేలియా’ వారు నిర్వహించినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫేస్బుక్ పేజీలో కూడా బ్లాక్ టౌన్ సిటీ కౌన్సిల్, సిడ్నీ దగ్గర నిర్వహించిన ప్రదర్శన వీడియో చూడవొచ్చు. అలానే, వాళ్ళ ఫేస్బుక్ పేజీలోని మరొక వీడియోలో పోస్ట్ చేసిన వీడియోలోని ట్రక్కుని చూడవొచ్చు. ఒకటే లైసెన్స్ ప్లేట్ మరియు ఇతర పోలీకలను చూడవొచ్చు.

‘హిందూ కౌన్సిల్ అఫ్ ఆస్ట్రేలియా’ వారు పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆ ట్రక్కు స్వామి నారాయణ మందిరం దగ్గర మొదలై, నగరంలో తిరిగి, చివరకు హారిస్ పార్కు దగ్గరకు వచ్చినట్టు చెప్తాడు. కావున, గూగుల్ మాప్స్ లో చూడగా, వీడియోలో ఉన్న పార్కింగ్ ప్రదేశం సిడ్నీ లో స్వామి నారాయణ మందిరం బిల్డింగ్ వెనకాల ఉన్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు, గూగుల్ మాప్స్ లో అదే ప్రదేశం యొక్క స్ట్రీట్ వ్యూ చూడగా, వీడియోలో ఉన్న బిల్డింగ్ ని చూడవొచ్చు.

‘హిందూ కౌన్సిల్ అఫ్ ఆస్ట్రేలియా’ వారిని సంప్రదించడానికి కూడా FACTLY ప్రయత్నించింది. వారి నుండి సమాధానం వచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, ట్రక్కు పై అయోధ్య రామ మందిరం ఫోటోలను ప్రదర్శిస్తున్న వీడియో సిడ్నీ (ఆస్ట్రేలియా) లో తీసింది; ఇజ్రాయిల్ లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll