Fake News, Telugu
 

ఒక సాధువు మొసలిపై స్వారీ చేస్తున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

“ఒక సాధువు మొసలిపై స్వారీ చేస్తున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో నిజమైన ఘటనను చూపిస్తున్నట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక సాధువు మొసలిపై స్వారీ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive, Cantilux, DeepFake-O-Meter వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో చాలా పలు తప్పిదాలు/ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపుస్తున్న సాధువుకు ఎడమ(left) చేతికి కేవలం నాలుగు వేళ్లు మాత్రమే ఉండటం, తెలుపు రంగు షర్ట్ ధరించిన వ్యక్తి చేతులకు వేళ్లు సరిగా లేకపోవడాన్ని (గజిబిజగా ఒకదానితో మరొకటి అతుక్కుపోయి ఉండటం),  నీలం (blue) రంగు షర్ట్ ధరించిన వ్యక్తికి చేతులు సరిగా లేకపోవడాన్ని (అస్తవస్థంగా చేతులు సగం మాత్రమే ఉండటం) మనం చూడవచ్చు. అలాగే వీడియోలో సాధువు మొసలి పైకి ఎక్కినప్పుడు, నీరు అతనిపై పడిన అతని బట్టలు తడవకుండా ఉండటాన్ని కూడా మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Hive, Cantilux, DeepFake-O-Meter వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియో 98.1% AI-జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. ఈ వైరల్ వీడియో 91% AI-జనరేటెడ్ కావచ్చని Cantilux ఫలితాన్ని ఇచ్చింది. అలాగే  DeepFake-O-Meter కూడా ఈ వీడియో AI- జనరేటెడ్ కావచ్చని ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఒక సాధువు మొసలిపై స్వారీ చేస్తున్నట్లు చూపించే ఈ వీడియో AI ద్వారా రూపొందించబడినది.

Share.

About Author

Comments are closed.

scroll