నూడుల్స్ ఉత్పత్తికి సంబంధించిన విజువల్స్‌ను చూపుతున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక వీడియో షేర్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: ఈ వీడియో నూడుల్స్ ఉత్పత్తికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో నూడిల్ తయారీ ప్రక్రియకు సంబంధించి కాదు. ఈ వీడియో సబ్బు తయారీ దృశ్యాలను చూపిస్తుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ చేసి చూస్తే, ఇదే వీడియోను మేము A2Z స్కిల్స్ అనే బహ్రెయిన్ ఆధారిత YouTube ఛానెల్‌లో కనుగొన్నాము. ఈ ఛానెల్ మాన్యుఫాక్చరింగ్ కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. ఈ YouTube షార్ట్ ‘సీవీ సబ్బు తయారీ ప్రక్రియ’ వీడియోగా లేబుల్ చేస్తూ ఆగస్ట్ 2024లో పోస్టు చెయ్యబడింది.
పైగా, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తులతో, ఇటువంటి వీడియో మరొకటి ఇదే ఛానల్లో షేర్ చెయ్యటం మేము గమనించాం. ఈ వీడియో కూడా సబ్బు తయారీ విధానాన్ని చూపిస్తుంది అని ఈ ఛానల్లో షేర్ చెయ్యబడింది. అల్ స్కిల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే వీడియోను షేర్ చేస్తూ ఇది సబ్బు ఉత్పత్తి చేసే విధానం అని పేర్కొనటం మేము గమనించాం.ఇదే వీడియోలను ఈ ఛానల్ యొక్క ఫేస్బుక్ పేజీలో కూడా అప్లోడ్ చెయ్యటం మేము గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ).
సబ్బు ఉత్పత్తికి సంబంధించిన వీడియోల గురించి మరింత వెతకగా, మేము సబ్బు తయారీ ప్రక్రియను ప్రదర్శించే ఇలాంటి మరిన్ని వీడియోలను కనుగొన్నాము (ఇక్కడ మరియు ఇక్కడ). నూడుల్స్ ఉత్పత్తి చేసే వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ఈ వీడియో నూడిల్ తయారీ ప్రక్రియకు సంబంధించి కాదు, సబ్బు తయారీకి సంబంధించింది.