Fake News, Telugu
 

ఈ వీడియోలో కేక్ కట్ చేసింది కాంగ్రెస్ అవతరణ దినోత్సవం రోజు, మన్మోహన్ సింగ్ పుట్టినరోజున కాదు

1

రాహుల్ గాంధీ మరియు మన్మోహన్ సింగ్ ఒక కేక్ ని కట్ చేస్తున్న వీడియో పెట్టి, ఆఖరికి మన్మోహన్ పుట్టినరోజు కేక్ ను కూడా రాహుల్ గాంధీ కట్ చేస్తున్నాడని ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్ : మన్మోహన్ సింగ్ పుట్టినరోజు కేక్ ని రాహుల్ గాంధీ కట్ చేస్తున్నాడు. 

ఫాక్ట్ (నిజం): వీడియోలో రాహుల్ గాంధీ మరియు మన్మోహన్ సింగ్ కట్ చేస్తుంది మన్మోహన్ సింగ్ పుట్టినరోజు కేక్ కాదు. అది 2018లో కాంగ్రెస్ అవతరణ దినోత్సవం సందర్భంగా కట్ చేస్తున్న కేక్. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, రాహుల్ గాంధీ మరియు మన్మోహన్ సింగ్ కేక్ ను కట్ చేస్తూ ఉన్న కొన్ని ఫోటోలను ‘ANI’ వారు డిసెంబర్-2018 లో ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ ద్వారా కాంగ్రెస్ అవతరణ దినోత్సవం (డిసెంబర్ 28) సందర్భంగా రాహుల్ గాంధీ మరియు మన్మోహన్ సింగ్ కేక్ ను కట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి సంబంధించి ‘NDTV’ ప్రచురించిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కాంగ్రెస్ అవతరణ దినోత్సవం వీడియో పెట్టి, మన్మోహన్ సింగ్ పుట్టినరోజు కేక్ ని రాహుల్ గాంధీ కట్ చేస్తున్నాడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll