Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని పెట్టి, ‘కాంగ్రెస్ చేయెత్తి జైకొట్టు తెలుగోడా…’ అంటూ రాసి ఉన్న గోడ ఫోటోని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసినట్టు షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ చెయ్యతి జైకొట్టు తెలుగోడా…..” అని రాసి ఉండి, తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీల గుర్తులతో ఉన్న ఒక గోడ ఫోటోని తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ వారు పోస్ట్ చేసినట్టు చెప్తూ, ఒక ట్వీట్ ఫోటోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘కాంగ్రెస్ చేయెత్తి జైకొట్టు తెలుగోడా…’ అంటూ రాసి ఉన్న గోడ ఫోటోని పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక ఎడిట్ చేసిన ఫోటో.తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ వారు పోస్ట్ చేసిన ఫోటోలో ‘కాంగ్రెస్’ పదం కానీ, కాంగ్రెస్ గుర్తు అయిన ‘హస్తం’ కానీ లేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

తెలుగుదేశం పార్టీ వారు వాళ్ల ట్విట్టర్ అకౌంట్‌లో అలాంటి ట్వీట్ ఏదైనా చేసారా అని వెతకగా, వారు అలాంటి ఫోటోతోనే ఈ రోజు ఒక ట్వీట్ చేసినట్టుగా కనిపించింది. అయితే వారు పోస్ట్ చేసిన ఫోటోలో గోడ మీద ‘కాంగ్రెస్’ పదం అసలు లేనట్టు చూడవచ్చు.

అంతకాదు, తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసిన ఫోటోలో గోడ మీద కాంగ్రెస్ గుర్తు అయిన ‘హస్తం’ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ  ‘సైకిల్’ గుర్తు ఉన్నట్టు చూడవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని పెట్టి, ‘కాంగ్రెస్ చేయెత్తి జైకొట్టు తెలుగోడా…’ అంటూ రాసి ఉన్న గోడ ఫోటోని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll