Fake News, Telugu
 

ప్రధాని పదవికి మోదీ కంటే రాహుల్ గాంధీ అర్హుడని చెప్తున్న ఈ సర్వే కేరళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం

0

దేశ ప్రధాని పదవికి ఎవరు అర్హులని టైమ్స్ నౌ న్యూస్ సంస్థ సర్వే చేస్తే, రాహుల్ గాంధీకి అత్యధికంగా 55.84% శాతం ఓట్లు పడినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘Times Now’ న్యూస్ ఛానల్ దేశ ప్రధాని పదవికి ఎవరు అర్హులని చేసిన సర్వే లో రాహుల్ గాంధీకి అత్యధికంగా 55.84% శాతం ఓట్లు పడ్డాయి.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, కేరళ రాష్ట్రంలో ‘Times Now’ న్యూస్ ఛానల్ నిర్వహించిన ‘Who is the most Preferred PM’ సర్వే కి సంబంధించింది. జనవరి 2021లో ‘Times Now’ దేశమంతటా ఈ సర్వే నిర్వహిస్తే, నరేంద్ర మోదీ కే అత్యధిక శాతం ఓట్లు పడినట్టు తెలిపింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు తప్పితే మిగితా అన్ని రాష్ట్రాల ప్రజలు నరేంద్ర మోదీయే మరో సారి ప్రధాని కావాలని కోరుకునట్టు ‘Times Now’ తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ ప్రజలని తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేసిన క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం కీ పదాలతో గూగల్ లో వెతికితే, ఈ సర్వే గురించి తెలుపుతూ ‘Times Now’ న్యూస్ ఛానల్ 08 మార్చి 2021 నాడు ఒక ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. కేరళ రాష్ట్రంలో ‘Who is the most Preferred PM’ అనే సర్వే నిర్వహిస్తే, 55.84% శాతం మంది కేరళ వోటర్లు రాహుల్ గాంధీకి ఓటు వేసినట్టు ‘Times Now’ తమ ట్వీట్ లో తెలిపింది. ఈ ఫలితాలు కేవలం కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే కి సంబంధించినవి అని ‘Times Now’ స్పష్టంగా తెలిపింది.

ప్రధాని పదవికి ఎవరు అర్హులని దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో ముప్పైవేల మంది పైన సర్వే నిర్వహిస్తే, దేశ ప్రజలు నరేంద్ర మోదీ కే అత్యధిక శాతం ఓట్లు వేసినట్టు ‘Times Now’ 17 జనవరి 2021 నాడు ట్వీట్ ద్వార రిపోర్ట్ చేసింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు తప్పిస్తే మిగితా అన్ని రాష్ట్రాల ప్రజలు నరేంద్ర మోదీయే మరో సారి ప్రధాని కావాలని కోరుకునట్టు ‘Times Now’ తెలిపింది.

చివరగా, ‘Times Now’ కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ని చూపిస్తూ దేశ ప్రజలు ప్రధాని పదవికి రాహుల్ గాంధీ అర్హుడని అత్యధిక శాతం ఓట్లు వేసినట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll