Fake News, Telugu
 

ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ అమెరికాలోని టెంపే నగరంలోనిది, చెన్నైలోది కాదు

0

“డ్రైవర్ లేకుండా నడిచే టాక్సీ సర్వీసు తొలిసారిగా చెన్నై లో ప్రారంభం” అయ్యింది అని చెప్తూ ఒక మహిళ తన కొడుకుతో Waymo కంపెనీ యొక్క సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌లో ప్రయాణం చేస్తూ వ్లోగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఈ వీడియోలోని కనిపించే డ్రైవర్ లేకుండా నడిచే టాక్సీ సర్వీస్ తొలిసారిగా చెన్నై లో ప్రారంభం

ఫాక్ట్(నిజం): ఈ వీడియో అమెరికాలోని అరిజోనాలో ఉన్న టెంపే నగరంలో షూట్ చేసారు, చెన్నైలో కాదు. మన దేశంలో అసలు Waymo సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సర్వీసు లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ముందుగా Waymo సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సర్వీసు మన దేశంలోనే చెన్నైలో మొదటగా ప్రారంభం అయ్యాయా అని చెక్ చేయడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, అసలు ఇది నిజం కాదు అని తెలిసింది. దీని గురుంచి ఎక్కడా కచ్చితమైన సమాచారం లభించలేదు.

Waymo వారి వెబ్సైట్ ప్రకారం వాళ్ళ సర్వీస్ అమెరికాలో మాత్రమే ఉంది, ఇండియాలో లేదు. 

అసలు ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారు అని వీడియోని చివరిదాకా చూస్తే, ఇందులో ఉన్న మహిళ రోడ్డు పైన ఉన్న రెండు బిల్డింగులను కార్లో నుండి చూపిస్తూ, అవి టెంపే రివర్ పక్కన ఉన్నాయి అని చెప్పారు. 

దీన్ని హింట్ లాగా తీసుకొని టెంపే రివర్ గురించి వెతకగా, ఇది అమెరికాలోని అరిజోన రాష్ట్రంలో ఉన్న టెంపే నగరంలో ఉంది అని తెలిసింది. గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూలో ఈ రెండు బిల్డింగ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, అమెరికాలో తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ వీడియోని చెన్నైలో ప్రపంచంలోనే మొదటగా ప్రవేశపెట్టిన సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీని చూపిస్తున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll