Fake News, Telugu
 

ఇండోనేషియాలో లోయలో పడిపోయిన బస్సు వీడియోని మేఘాలయలో జరిగిన ఒక ప్రమాదం దృశాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

మేఘాలయాలో ఒక లోయలో పడిపోయిన ఒక బస్సు దృశ్యాలు అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం.

క్లెయిమ్: ఈ వీడియో మేఘాలయలో ఒక బస్సు లోయలో పడిపోయిన దృశ్యాలను చూపిస్తుంది.

ఫాక్ట్(నిజం): 7 మే 2023న టూరిస్ట్ బస్సు గుసి, టెగల్, సెంట్రల్ జావాలో లోయలో పడి ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసినప్పుడు ఇండోనేషియాలో ఈ వీడియో తీశారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని  తనిఖీ చేయడానికి, మేము వైరల్ వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ వల్ల, వైరల్ పోస్ట్‌లో ఉన్న వీడియో యొక్క దృశ్యాలు కలిగి ఉన్న ఒక ట్వీట్‌ మాకు దొరికింది. దాని ప్రకారం, ఇండోనేషియా దేశం, సెంట్రల్ జావాలోని టెగల్ నగరంలో ఒక 50 మంది ప్రయాణికులు ఉన్న బస్సు ఒక నదిలో పడిపోయింది.

ఈ విషయాన్ని నిర్ధారించుకోవటానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనపై  అనేక వార్తా కథనాలు లభించాయి. 

వీటిని బట్టి ఈ సంఘటన 7 మే 2023న సెంట్రల్ జావాలో జరిగింది.  ఈ బస్సు Banten అనే ప్రదేశం నుండి Guciకి వెళ్తుండగా, డ్రైవర్ ఒక చోట పార్క్ చేసి బయటికి వెళ్ళినప్ప్పుడు ఈ సంఘటన జరిగింది. పార్క్ చేసినప్పుడు డ్రైవర్ ఇంజన్ ఆన్ చేసి ఉంచాడు, బస్సు ఇంజన్ వేడిగా ఉంచడానికి ఇలా చేసాడని ఈ వార్తా కథనంలో రాసారు. అయితే ఈ క్రమంలో 37 మంది ప్రయాణికులతో పార్క్ చేసి ఉన్న బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మీరు దీని గురించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.

చివరిగా, ఇండోనేషియాలో లోయలో పడిపోయిన బస్సు వీడియోని మేఘాలయలో జరిగిన ప్రమాదం అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll