ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పోస్ట్ చేసి, అది నెహ్రు 1954లో అమెరికా సందర్శించినప్పుడు తీసినదని చాలా మంది చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ : ఫోటో నెహ్రు 1954లో అమెరికా సందర్శించినప్పటి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటో నెహ్రు 1955లో సోవియెట్ యూనియన్ పర్యటించినప్పటిది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
కాంగ్రేస్ ఎంపి శశి థరూర్ కూడా అదే చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అలాంటి వివరణ తోనే ట్వీట్ చేసారు, కానీ ఆ తరువాత, ఆయన ఆ చిత్రం బహుశా సోవియెట్ యూనియన్ సందర్శనప్పటిది అయి ఉండొచ్చని, అమెరికా ది కాదని స్పష్టం చేశారు. (ఆ ట్వీట్ యొక్క ఆర్కివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు)
I am told this picture (forwarded to me) probably is from a visit to the USSR and not the US. Even if so, it still doesn’t alter the message: the fact is that former PMs also enjoyed popularity abroad. When @narendramodi is honoured, @PMOIndia is honoured; respect is for India. https://t.co/9KQMcR0zTD
— Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019
పోస్ట్‌లోని చిత్రాన్ని యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికినప్పుడు, దానిని ఒక వెబ్సైటు లో ‘జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ సమావేశం, 1955, రష్యా, చెలియాబిన్స్క్ ఓబ్లాస్ట్, మాగ్నిటోగోర్స్క్’ అనే అర్ధం వచ్చేలా రష్యన్ భాషలో ఉన్న డిస్క్రిప్షన్ తో లభించింది. ఫోటో దిగువన ఉన్న కామెంట్స్ విభాగంలో ఒక వ్యక్తి నెహ్రూ మరియు ఇందిరా గాంధీ ఉన్న ప్రదేశం యొక్క భౌగోళిక స్థానాన్ని కూడా ఇచ్చారు. ఆ ఫొటోలో కనిపించే రెండు భవనాలను గూగుల్ స్ట్రీట్ వ్యూలో ఈ అడ్రస్ లో చూడవచ్చు – ‘28 ప్రాస్పెక్ట్ పుష్కినా, మాగ్నిటోగోర్స్క్, చెలియాబిన్స్క్ ఓబ్లాస్ట్, రష్యా’.

“Outlook traveller” వెబ్సైటు లో ఉన్న ఒక ఆర్టికల్ (The Soviet land, 1955) ద్వారా, నెహ్రు తన కుమార్తె ఇందిరా గాంధీతో జూన్ 1955 లో సోవియెట్ యూనియన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో వారిద్దరూ మాస్కో నుండి లెనిన్గ్రాడ్ కి వెళ్లే దారిలో మాగ్నిటోగోర్స్క్ వెళ్లినట్లుగా ఆ ఆర్టికల్ లో చూడవచ్చు. ఆ పర్యటనకి సంబంధించిన మరింత సమాచారం మరియు ఫోటోల కోసం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, నెహ్రు 1954లో అమెరికా సందర్శించినప్పటి ఫోటో అని ప్రచారం అవుతున్నది, 1955లో తను సోవియెట్ యూనియన్ పర్యటించినప్పుడు తీసినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఆ ఫోటో 1955లో నెహ్రు సోవియెట్ యూనియన్ పర్యటించినప్పటిది - Fact Checking Tools | Factbase.us