బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బెల్లీ డాన్సర్ దుస్తులలో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫొటో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: బెల్లీ డాన్సర్ దుస్తులలో ఉన్న బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. అసలు ఫోటో ట్రిప్ అడ్వైసర్ వెబ్సైటులో క్లబ్ ఎక్ససెల్సీర్ అనే హోటల్ వారి ఫోటో ఆల్బంలో ఉంది. అసలు ఫొటో కలర్‌లో ఉంది మరియు అందులో స్మృతి ఇరానీ కాకుండా వేరే ఆవిడ ఉన్నారు. అందుచేత పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులోని ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఫోటో యొక్క ఒరిజినల్ ఇమేజ్ ట్రిప్ అడ్వైసర్ అనే వెబ్సైటులో మాకు లభించింది. క్లబ్ ఎక్ససెల్సీర్ అనే హోటల్‌కి సంబంధించిన ఫొటో గ్యాలరీలో ఈ ఫోటో ఉంది. ఆ ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

“Belly Dancer on the Turkish BBQ night“, అనేది ఆ ఫోటో కింద ఉన్న వివరణ. కలర్లో ఉన్న ఈ ఫోటోని, బెల్లీ డాన్సర్ మొహానికి బదులుగా స్మృతి ఇరానీ మొహాన్ని పెట్టి ఎడిట్ చేసి, బ్లాక్ అండ్ వైట్‌గా మార్చిన ఫోటోని షేర్ చేస్తున్నారు.

చివరగా, బెల్లీ డాన్సర్ దుస్తులలో ఉన్న ఈ స్మృతి ఇరానీ ఫోటో ఎడిట్ చేయబడినది, నిజం ఫోటో కాదు.