Fake News, Telugu
 

ఈ ఫోటోలు హైదరాబాద్‌లోని ఒక ఇస్లామిక్ సెమినరీలో ముస్లింలు హిందూ ఇతిహాసాలను చదువుతున్న దృశ్యాలు

0

ముస్లింలు భారతీయ హిందూ ఇతిహాసాల పుస్తకాలలోని చరిత్రను చేరిపేసి తమకు అనుకూలంగా తిరిగి లిఖించుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలు భారతీయ హిందూ ఇతిహాసాల పుస్తకాలలోని చరిత్రను చెరిపేస్తూ తమకు అనుకూలంగా తిరిగి లిఖించుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ ప్రసిద్ధ ‘అల్ మహదుల్ ఆలీ అల్ ఇస్లామీ’లోని విద్యార్థులు, ఇస్లాం, హిందూమతంలోని సారూప్య విషయాలు అర్థం చేసుకోవడానికి వేదాలను చదువుతున్న దృశ్యాలివి. ఈ ఫోటోలోని ముస్లిం విద్యార్ధులు హిందూ ఇతిహాసాల పుస్తకాలని తిరిగి లిఖించడం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘‘ది హిందూ’’ వార్తా సంస్థ 02 ఏప్రిల్ 2014 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ ప్రసిద్ధ ‘అల్ మహదుల్ ఆలీ అల్ ఇస్లామీ’లోని విద్యార్థులు, ఇస్లాం, హిందూమతంలోని సారూప్య విషయాలను అర్థం చేసుకోవడానికి వేదాలను చదువుతున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ ఇస్లాం సెమినరీలో హిందూ, ఇతర మతాలకు సంబంధించిన వెయ్యికి పైగా పుస్తకాలు ఉన్నట్టు ఆర్టికల్‌లో తెలిపారు. విద్యార్ధులలో నైతిక నాయకత్వాన్ని, న్యాయబద్దమైన ఏకీకరణని పెంపొందించడానికి ఇతర మతాల ఇతిహాసాలను విధ్యార్ధులతో చదివిస్తున్నట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఫోటోలో కనిపిస్తున్న ముస్లిం విద్యార్ధులు హిందూ ఇతిహాసాలని తిరిగి తమకు నచ్చినట్టగా లిఖిస్తున్నట్టు ఈ ఆర్టికల్‌లో ఎక్కడా తెలుపలేదు.

ఈ ఫోటోకి సంబంధించిన మరింత స్పష్టత కోసం ‘ఇండియా టుడే’ ఫాక్ట్ చెక్ టీమ్ ‘అల్ మహదుల్ ఆలీ అల్ ఇస్లామీ’ సేమినరి యొక్క డిప్యూటీ డైరెక్టర్ ఒమాన్ అబెదీన్‌ని సంప్రదించింది. ఒమాన్ అబెదీన్‌ ఈ ఫోటో గురించి ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ, “ ‘అల్ మహదుల్ ఆలీ అల్ ఇస్లామీ’, ఒక ఇస్లామిక్ పరిశోధనా సంస్థ. మా ఇన్‌స్టిట్యూటులోని ‘స్టడీస్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్చర్’ అనే విభాగం ఉంది. ఈ డిపార్ట్మెంటులో చదువుతున్న విద్యార్ధులకి హిందూ మతానికి సంబంధించిన అవగాహన కోసం భగవద్గీత మరియు ఉపనిషత్తులవంటి హిందూ వేదాలను బోధిస్తాము. మేము మా విద్యార్థులకు తరగతులు తీసుకోవడానికి ఇతర మతాల పండితులను కూడా ఆహ్వానిస్తాము. ఒకసారి ‘ది హిందూ’ న్యూస్ సంస్థ జర్నలిస్టులు మా ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించారు. మా సెమినరీలోని పుస్తకాల సేకరణను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఈ ఫోటో అప్పుడు తీసినదే. మా సెమినరీలో హిందూ, క్రైస్తవ మతాలతో సహా ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాలు దాదాపు 1,500 ఉన్నాయి”, అని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న ముస్లింలు హిందూ ఇతిహాసాలాను తిరిగి లిఖించడం లేదని చెప్పవచ్చు.

చివరగా, హైదరాబాద్‌లోని ఒక ఇస్లామిక్ సెమినరీలో ముస్లింలు హిందూ ఇతిహాసాలను చదువుతున్న దృశ్యాలని హిందూ ఇతిహాసాలను ముస్లింలు తిరిగి లిఖిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll