Fake News, Telugu
 

స్వచ్ఛమైన పంజాబీ ఫుడ్ ఈ నాయుడు ఆంధ్ర మెస్‌లో లభిస్తుంది అని సూచిస్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది

0

కన్నడ లిపిలో పేరు. నాయుడు ఆంధ్ర మెస్, అక్కడ దొరికేది పంజాబీ ఫూడ్’ అని చెప్తూ కన్నడ లిపిలో నాయుడు ఆంధ్ర మెస్ అని రాసి ఉన్న ఒక బోర్డు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: బోర్డుపైన నాయుడు ఆంధ్ర మెస్ పేరు కన్నడ లిపిలో రాసి ఉన్న ఈ మెస్‌లో పంజాబీ ఆహరం లభిస్తుంది. 

ఫాక్ట్(నిజం): ఫొటోలో ఉన్న బోర్డు బెంగుళూరులోని నల్లూరుహళ్లిలో ఉన్న ‘నాయుడు ఆంధ్ర మెస్’ది. ఈ ఫోటో యొక్క అసలు వెర్షన్‌లో ‘అథెంటిక్ పంజాబీ ఫుడ్’ అని రాసి ఉండదు, దాన్ని ఎడిటింగ్ చేసి డిజిటల్ గా తయారు చేసారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవటానికి, నాయుడు ఆంధ్ర మెస్ అని గూగుల్‌లో టైపు చేసి వెతకగా, ఈ మెస్ బెంగళూరులోని నల్లూరుహళ్లిలో ఉందని తెలిసింది. గుగూల్ ఫొటోస్‌లో ఉన్న ఈ మెస్‌కు చెందిన కొన్ని చిత్రాల్లో వైరల్ ఫోటో యొక్క అసలు వెర్షన్ ఉంది. కానీ, రెండిటి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటిగా, నాయుడు ఆంధ్ర మెస్ అని రాసి ఉన్న బోర్డు పైన  ‘అథెంటిక్ పంజాబీ ఫుడ్’ అనే వాక్యం లేదు. రెండోవది, ఎడమవైపు ఉన్న చిన్న బోర్డు పైన పంజాబీ మెనూ లేదు. అసలు ఫోటో మరియు వైరల్ ఫోటో మధ్య వ్యత్యాసాన్ని కింద మీరు గమనించవచ్చు.

ఈ ఒక్క ఫొటోలోనే కాకుండా, గూగుల్ ఫొటోస్‌లో ఉన్న నాయుడు ఆంధ్ర మెస్ వేరే ఫొటోల్లో , ఒక్క దానిలో కూడా, అక్కడ పంజాబీ ఆహరం దొరుకుతుంది అని రాసి లేకపోవటం మీరు గమనించవచ్చ (ఇక్కడ, ఇక్కడ). వీటన్నిటి ఆధారంగా వైరల్ ఫోటో ఎడిట్ చేయబడినది అని మనం నిర్ధారించుకోవచ్చు. 

చివరిగా, స్వచ్ఛమైన పంజాబీ ఫుడ్ ఈ నాయుడు ఆంధ్ర మెస్‌లో లభిస్తుంది అని సూచిస్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. 

Share.

About Author

Comments are closed.

scroll