Fake News, Telugu
 

ఎంపీ ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న కలిసి కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపిస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేసినది

0

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీలో ఇటీవల చేరిన తీన్మార్ మల్లన్న కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపిస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న 07 డిసెంబర్ 2021 నాడు బీజేపిలో చేరిన నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.  ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న కలిసి కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ధర్మపురి అరవింద్ షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో వారు కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ దాచి పెట్టిలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 06 డిసెంబర్ 2021 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. “ఢిల్లీలోని నా నివాసంలో ప్రముఖ జర్నలిస్టు, తీన్మార్ మల్లన్నతో”, అని తెలుపుతూ ధర్మపురి అరవింద్ ఈ ఫోటోని షేర్ చేసారు.

అసలు ఫోటోలో ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపించడం లేదు. పైగా మద్యం బాటిల్ ఉన్న ఫొటోలన్నీ కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేసిన సమయం తరువాతే సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని చెప్పవచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని ఎంపీ ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll