Fake News, Telugu
 

ఈ మ్యూజికల్ వీడియోను కేవలం ఆరు రోజుల్లో చిత్రీకరించారు, మూడు సంవత్సరాల్లో కాదు

0

స్విమ్మింగ్ పూల్‌లో వందల మంది మహిళా డాన్సర్లతో కొరియోగ్రాఫ్ చేసినట్టు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఈ పాట షూటింగ్‌కు మూడు సంవత్సరాలు పట్టిందని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. పైగా వీడియోకు ఒక బాలీవుడ్ పాటను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మూడు సంవత్సరాల పాటు షూటింగ్ చేసిన పాటకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 1933లో వార్నర్ బ్రదర్స్ స్టూడియో నిర్మించిన ‘ఫూట్‌లైట్ పెరేడ్’ అనే సినిమాలోని ‘బై ఏ వాటర్‌ఫాల్’ ఒక మ్యూజికల్. ఈ మ్యూజికల్‌ను కేవలం ఆరు రోజుల్లో షూట్ చేసారు. కాకపోతే అంతకు ముందు రెండు వారాలు రిహార్సల్ చేసినట్టు తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో 1933లో వార్నర్ బ్రోస్ స్టూడియో నిర్మించిన ‘ఫూట్‌లైట్ పెరేడ్’ అనే ఒక మ్యూజికల్ (సంగీతం ప్రధానంగా నడిచే) సినిమా నుండి సేకరించారు. పోస్టులో షేర్ చేసిన వీడియోపై దీనికి సంబంధించిన వాటర్ మార్క్ కనిపిస్తుంది.

ఐతే వార్నర్ బ్రోస్ నిర్మించిన ఈ సినిమాలో మొత్తం మూడు మ్యూజికల్స్ ఉంటాయి. అందులొ ఒకటి 15 నిమిషాల నిడివిగల ‘బై ఏ వాటర్‌ఫాల్’. పోస్టులో షేర్ చేసింది ఈ మ్యూజికల్ వీడియోనే. ఈ చిత్రం1992లో నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌కి ఎంపికైంది.

ఐతే ఈ మ్యూజికల్ షూటింగ్‌కు సంబంధించిన సమాచారం ప్రకారం ఈ మ్యూజికల్‌ను బస్బీ బర్కిలీ కొరియోగ్రాఫ్ చేసారు. స్విమ్మింగ్ పూల్ సెట్‌లో మొత్తం 20 గాలన్ల నీరు వాడి ఈ వాటర్ బ్యాలెట్ మ్యూజికల్‌ను షూట్ చేసారు. ఐతే మ్యూజికల్‌ను కేవలం ఆరు రోజుల్లో షూట్ చేసారు. కాకపోతే అంతకు ముందు రెండు వారాలు రిహార్సల్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన పలు బ్లాగ్స్ కూడా ఈ మ్యూజికల్ కేవలం ఆరు రోజుల్లో షూట్ చేసినట్టు తెలుపుతున్నాయి. ఐతే ఈ వీడియోకు ఒక పాత బాలీవుడ్ పాటను జత చేసి షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ మ్యూజికల్ వీడియోను కేవలం ఆరు రోజుల్లో చిత్రీకరించారు, మూడు సంవత్సరాలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll