Fake News, Telugu
 

తాజాగా నదిలో చిక్కుకున్న వారిని తెలంగాణలో హెలికాప్టర్ సహాయంతో కాపాడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి కావు

0

చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరిని ఆపద నుండి కాపాడిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నదిలో చిక్కుకున్న వారిని తెలంగాణ చెన్నూరు మండలంలో హెలికాప్టర్ సహాయంతో కాపాడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్: పోస్ట్ చేసిన వీడియోలోని దృశ్యాలు పాతవి. అది తెలంగాణకి సంబంధించిన వీడియో కాదు. అయితే, పోస్ట్‌లో చెప్పిన ఘటన మాత్రం నిజంగానే జరిగింది. ఆ ఘటన గురించి చెప్తూ, వేరే దృశ్యాలతో తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ ట్వీట్ చేసారు. కావున, పోస్ట్‌లో సంబంధంలేని దృశ్యాలు పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే వీడియోని కొందరు నవంబర్ 2021లోనే పోస్ట్ చేసినట్టు తెలిసింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోగా చాలా మంది పెట్టిన పాత పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, పోస్ట్‌లో చెప్పిన ఘటన మాత్రం నిజంగానే జరిగింది. ఆ ఘటన గురించి చెప్తూ, వేరే దృశ్యాలతో తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ ట్వీట్ చేసారు.

కానీ, పాత దృశ్యాలతో ‘తెలంగాణ టుడే’ ప్రచురించిన అర్టికల్‌ని కూడా బాల్క సుమన్‌ రీట్వీట్ చేసారు.

చివరగా, తాజాగా నదిలో చిక్కుకున్న వారిని తెలంగాణలో హెలికాప్టర్ సహాయంతో కాపాడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి కావు.

Share.

About Author

Comments are closed.

scroll