Fake News, Telugu
 

‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అని కాదు, మూడు రైతు చట్టాలను బహిష్కరించండని ప్లకార్డు మీద రాసి ఉంది

0

రైతుల ఉద్యమంలో ముస్లిం మహిళలు పాల్గొన్నారని, అయితే వారు నిర్వహించిన ర్యాలీలో ఒక్క ప్లకార్డు మీద కూడా రైతులకు సంబంధించిన నినాదం లేదని చెప్తూ, కొందరు ముస్లిం మహిళలు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ గా వెళ్తున్న ఫోటోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్లకార్డులపై రైతులకు సంబంధించిన నినాదాలు లేవు కానీ ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అనే నినాదం మాత్రం చేసినట్టు కూడా పోస్ట్ లో చెప్తున్నారు. ఈ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  రైతులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో రైతుల నినాదాలకు బదులుగా ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అనే ప్లకార్డు పట్టుకున్న ముస్లిం మహిళల ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో మహిళలు పట్టుకున్న ప్లకార్డుల మీద రైతులకు సంబంధించిన నినాదాలు ఉన్నాయి. ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అని కాదు, ‘BOYCOTT TEEN KAALE KANOON’ [మూడు నల్ల (రైతు) చట్టాలను బహిష్కరించండి] అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో తాజగా ముంబై లో రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసన కి సంబంధించిన ఫోటో అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పోస్ట్ చేసిన ఫోటోని జూమ్ చేసి ప్లకార్డుల పై ఏం రాసి ఉందో చూడగా, ఒక ప్లకార్డు పై ‘BOYCOTT TEEN KAALE KANOON’ [మూడు నల్ల (రైతు) చట్టాలను బహిష్కరించండి] అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నట్టు తెలుస్తుంది. ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అని రాసి లేదు.

అంతేకాదు, వెనక పట్టుకున్న ప్లకార్డు కూడా రైతులకి సంబంధించిందే. ఆ ప్లకార్డు లాంటి ప్లకార్డులను ముంబై నిరసన ర్యాలీలో చాలా మంది చేతిలో చూడవొచ్చు. ముంబై ర్యాలీ కి సంబంధించి కొంత మంది పోస్ట్ చేసిన దృశ్యాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ముస్లిం మహిళలు పట్టుకున్న ఈ ప్లకార్డు మీద ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అని కాదు, మూడు రైతు చట్టాలను బహిష్కరించండని రాసి ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll