Fake News, Telugu
 

01 సెప్టెంబర్ 2025 నుంచి లెటర్ బాక్సులను తొలగిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

0

01 సెప్టెంబర్ 2025 నుంచి లెటర్ బాక్సులను (ఉత్తరాలు వేసే ఎరుపు రంగు డబ్బా) ఇండియా పోస్టు (తపాలా శాఖ) తొలగిస్తుందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 01 సెప్టెంబర్ 2025 నుంచి లెటర్ బాక్సులను తొలగిస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది.

ఫాక్ట్: లెటర్ బాక్సులను తొలగించట్లేదని, ఇవి ఎప్పటిలాగానే పని చేస్తాయని తపాలా శాఖ స్పష్టం చేసింది. అయితే, 01 సెప్టెంబర్ 2025 నుంచి రిజిస్టర్డ్ పోస్టుని మాత్రం స్పీడ్ పోస్టు సర్వీసులో విలీనం చేస్తున్నట్లు తాపాల శాఖ ప్రకటించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించి తపాలా శాఖ ఎక్కడా ప్రకటన చేసినట్లు ఆధారాలు లభించలేదు. పైగా, లెటర్ బాక్సులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో తపాలా శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. లెటర్ బాక్సులను తొలగించట్లేదని, అవి ఎప్పటిలాగే పని చేస్తాయని స్పష్టం చేసింది.

అయితే, 01 సెప్టెంబర్ 2025 నుంచి రిజిస్టర్డ్ పోస్టుని స్పీడ్ పోస్టు సర్వీసులో విలీనం చేస్తున్నట్లు తాపాల శాఖ ప్రకటించింది. సేవల ఆధునీకరణ, వేగవంతమైన డెలివరీ, క్రమబద్ధీకరణ వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తపాలా శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

అయితే, డేటాఫుల్ గణాంకాల ప్రకారం (ఇక్కడ & ఇక్కడ), భారత్‌లో లెటర్ బాక్సుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2016-17 లో దేశంలో 4.85 లక్షల లెటర్ బాక్సులు ఉండగా, ఈ సంఖ్య 2023-24 నాటికి 3.67 లక్షలకి పడిపోయింది.

A number of letter boxes  AI-generated content may be incorrect.

చివరిగా, 01 సెప్టెంబర్ 2025 నుంచి లెటర్ బాక్సులను తొలగిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తాపాలా శాఖ స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll