“కాంగ్రెస్ కేంద్రంలోకి వస్తే మొదటగా నేను సంతకం చేసే ఫైల్స్, RSS బ్యాన్ చేస్తాను, బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తాను, NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) అమలు తెస్తాను, NOC అంటే ప్రతి హిందువు తన ఇంట్లో తాను పూజ చేసుకోవడానికి పక్కన ఉండే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మాకు అభ్యంతరం లేదు అని సంతకం చేయాలి అప్పుడు మాత్రమే ప్రతి హిందువు తన ఇంట్లో పూజ చెయ్యాలి” అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చెప్పారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను బాన్ చేస్తానని, బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తానని, హిందువులు తమ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి పక్కనే నివసించే క్రైస్తవులు, ముస్లింల నుండి NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందడం తప్పనిసరి చేస్తానని రాహుల్ గాంధీ అన్నారు.
ఫాక్ట్(నిజం): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను RSS ను బాన్ చేస్తానని, హిందువులు తమ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి పక్కనే నివసించే క్రైస్తవులు, ముస్లింల నుండి NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందడం తప్పనిసరి చేస్తానని రాహుల్ గాంధీ అన్నట్లు ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు/రిపోర్ట్స్ లేవు. అయితే, కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే 01 జూలై 2025న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ను నిషేధిస్తుందని అన్నారు. అలాగే, 2005లో ‘The Communal Violence Bill’ పేరుతో, 2011లో ‘Prevention of Communal and Targeted Violence’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిల్లులను తీసుకొని రావాలని చూసింది. అయితే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయింది. ఈ బిల్లులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నట్టు బీజేపీ సహా కొందరు పేర్కొన్నారు. కాకపోతే , వీటిల్లో కూడా NOC లాంటి అంశాలు ఏవీ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్ట్‌లో ముందుగా పేర్కొన్నట్లుగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను RSS ను బాన్ చేస్తానని, బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తానని, హిందువులు తమ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి పక్కనే నివసించే క్రైస్తవులు, ముస్లింల నుండి NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందడం తప్పనిసరి చేస్తానని రాహుల్ గాంధీ అన్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు/రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి.
అలాగే మేము రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా పరిశీలించాము, అక్కడ కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
ఈ క్రమంలోనే, కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే 01 జూలై 2025న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ను నిషేధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ RSSను పలుమార్లు నిషేధించిందని, ఆ నిషేధాలను ఎత్తివేసినందుకు చింతిస్తున్నానని అన్నారు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసినట్లు తెలిసింది (ఇక్కడ & ఇక్కడ).

అయితే, 2005లో ‘The Communal Violence Bill’ పేరుతో మరియు 2011లో ‘Prevention of Communal and Targeted Violence’ పేరుతో కాంగ్రెస్ పార్టీ బిల్లులను తీసుకొని రావాలని చూసింది. అయితే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ బిల్లులు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నట్టు బీజేపీ సహా కొందరు పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఎందుకంటే ఈ బిల్లు దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలకు (ఎక్కువ సందర్భాల్లో హిందువులే మెజారిటీగా ఉంటారని), కావున వారు ఈ బిల్లుల వల్ల నష్టపోతారని వారు పేర్కొన్నారు.

ఈ రెండు బిల్లులలో కూడా ఎక్కడా హిందువులకు సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింల (మైనారిటీల) నుండి హిందువులు NOC సర్టిఫికేట్ తీసుకోవాలని లేదు. 2011 బిల్లులో ‘గ్రూప్’ అంటే మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ లేదా ఎస్సీ, ఎస్టీ అని ఉన్నట్టు చదవచ్చు. రెండు బిల్లుల్లో ‘హిందువు’ అనే పదం కూడా లేన్నట్టు గమనించవచ్చు.
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2005 ,2011లో తేవాలని చూసిన ఈ బిల్లులలోని నిబంధనలలో పాలు హిందూ వ్యతిరేక నిబంధనలు ఉన్నాయని, హిందువులకు సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింల (మైనారిటీల) నుండి హిందువులు NOC సర్టిఫికేట్ తీసుకోవాలని ఈ బిల్లులలో ఉందని పలు పోస్టులు వైరల్ కాగా, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వల హయాంలో RSSను ఇప్పటివరకు మూడుసార్లు నిషేధించారు, అయితే ఆతర్వాత ఆ నిషేధం ఎత్తివేయబడింది (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే RSSను నిషేధిస్తానని, బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తానని, హిందువులు తమ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి క్రైస్తవులు, ముస్లింల నుండి NOC తీసుకునేలా చేస్తానని రాహుల్ గాంధీ అన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.