విక్రమాదిత్యుడు భారత దేశం మాత్రమే కాకుండా ఇప్పటి అరబ్ ప్రాంతాలు మరియు చైనాలోని చాలా ప్రాంతాలు పరిపాలించారని, సౌదీ అరేబియాలోని కాబాలో విక్రమాదిత్యుడిపై రాసిన అరబిక్ రాతలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాబాలో బంగారు రేకుపై విక్రమాదిత్యుడి గురించి రాసిన అరబిక్ రాతలు అతను అరబ్ ప్రాంతాలు మరియు చైనాలోని చాలా ప్రాంతాలు పరిపాలించారని ధ్రువీకరిస్తున్నాయి.
ఫాక్ట్: కాబాలో బంగారు రేకుపై విక్రమాదిత్యుడి గురించి అరబిక్ రాతలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. హిందూ కేంద్రిత చారిత్రక సవరణవాదానికి (Historical Revivalism) ప్రసిద్ధి చెందిన పి.ఎన్.ఓక్ ఇలా అన్నాడు. తాజ్ మహల్ తెజో మహల్ అనే హిందూ ఆలయం అని, క్రైస్తవమతం వాస్తవానికి కృష్ణ-నీతి (“కృష్ణ సిద్ధాంతం”) అని, మరియు కాబా ఒక శివాలయమని ఇలా విచిత్రమైన విషయాలు పుస్తకాల్లో రాసేవాడు. కానీ, వీటికి ఎక్కడ ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పినట్టు సౌదీ అరేబియాలోని కాబాలో అటువంటి ఒక బంగారు రేకుపై విక్రమాదిత్యుడి గురించి తెలిపినట్టు ఎక్కడా కూడా కచ్చితమైన సమాచారం మాకు లభించలేదు.
విక్రమాదిత్యుడు సుమారు మొదటి శతాబ్దపు BCEలో భారతదేశాన్ని పరిపాలించినట్టు చెప్తుంటారు. ఆయన ఒక గొప్ప రాజని, ఔదార్యానికి, ధైర్యానికి, మరియు పాండిత్యాన్ని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడని అంటారు. “విక్రమాదిత్య” అనే ఒక బిరుదుగల పేరును అనేక మంది భారతీయ రాజులు స్వీకరించారు. అందుకే, తర్వాత వచ్చిన ఎంతో మంది రాజులను విక్రమాదిత్యుడనే పిలిచేవారు. కావున, ఏ రాజు గురించి పోస్టులో ప్రస్తావించారో కచ్చితంగా చెప్పలేము, కానీ, పోస్టులో చెప్పినట్టుగా అటువంటిది జరిగినట్టు NCERT చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కూడా లేదు.
పోస్టులో చెప్పినట్టుగా Sayar-ul-Okul అనే పుస్తకం ఆన్‌లైన్‌లో లభించలేదు. కాబాలో సంస్కృతంలో రాతలు ఉన్నాయని పురుషోత్తమ నాగేష్ ఓక్ (పి.ఎన్.ఓక్), (హిందూ కేంద్రిత చారిత్రక సవరణవాదానికి (Historical Revivalism) ప్రసిద్ధి చెందాడు) రాసాడు. తాజ్ మహల్ తెజో మహల్ అనే హిందూ ఆలయం అని, క్రైస్తవమతం వాస్తవానికి కృష్ణ-నీతి (“కృష్ణ సిద్ధాంతం”) అని, మరియు కాబా ఒక శివాలయమని ఇలా విచిత్రమైన విషయాలు పుస్తకాల్లో రాసేవాడు. ‘Was Kaaba a Hindu Temple?’ అనే పేరుతో 13 పేజీల కరపత్రంలో, ఓక్ , కాబా లోపల భారతీయ రాజు విక్రమాదిత్యుని పేర్కొంటూ ఒక శాసనం ఆధారంగా ఓక్ ఇటువంటి క్లెయిమ్ ఒకటి చేసాడు.
Sayar-ul-Okul అనే పుస్తకం యొక్క 315వ పేజీలో దీని రుజువు ఉన్నట్టు తెలిపాడు, ఇది ‘Makhtab-e-Sultania library in Istanbul, Turkey’ లో ఉన్నట్టు తెలిపారు. కానీ, దీని గురించి ఆన్‌లైన్‌లో వెతకగా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.
చివరగా, కాబాలో బంగారు రేకుపై విక్రమాదిత్యుడి గురించి ఇలా అరబిక్ రాతలు రాసి ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.