Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలో కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండి అని చెప్తున్న మహిళ కెనడా ప్రధాని భార్య కాదు

0

ఒక మహిళ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ లో వీడియో ని రికార్డు చేసుకుంటూ కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండని ప్రజలకు చెప్తున్న వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో లో ఉన్నది కెనడా దేశ ప్రధాని భార్య అని పేర్కొంటున్నారు. వీడియో గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలో కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండి అని చెప్తున్న మహిళ కెనడా ప్రధాని భార్య.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండి అని చెప్తున్న మహిళ కెనడా ప్రధాని భార్య (సోఫీ గ్రగోయిర్ ట్రూడో) కాదు, ఆమె తారా జేన్ లాంగ్స్టన్. ఆమె కొరోనా వైరస్ తో బాధ పడుతూ లండన్ లోని ఒక ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నది. లాంగ్స్టన్ ఆ వీడియో ని తన దేశం లోని వారికి కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండని చెప్పడానికి తీసింది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కి కొరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ అని తేలింది. అప్పటినుండి ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు.

వీడియో యొక్క స్క్రీన్ షాట్లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘Dailymail’ వారి కథనం సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. దాని ద్వారా, ఆ వీడియోలో మాట్లాడుతున్న మహిళ కెనడా ప్రధాని భార్య (సోఫీ గ్రగోయిర్ ట్రూడో) కాదని తెలిసింది. ఆ కథనం ప్రకారం, ఆ వీడియోలో ఉన్న మహిళ తారా జేన్ లాంగ్స్టన్. తను ఒక ‘వెయిట్రెస్’. ఆమె 15 మార్చి న అస్వస్థతతో లండన్ లోని హిల్లింగ్ డన్ ఆసుపత్రిలో చేరడంతో, పరీక్షల అనంతరం ఆమెకి కొరోనా వైరస్ సోకినట్లుగా తేలింది. దాంతో ఆమె గత కొన్ని రోజులుగా ఆ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతోంది. వీడియోని లాంగ్స్టన్ తన దేశం లోని వారికి కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండని చెప్పడానికి తీసింది.

చివరగా, వీడియోలో కొరోనా వైరస్ ని సీరియస్ గా తీస్కోండి అని చెప్తున్న మహిళ కెనడా ప్రధాని భార్య కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll