17 మార్చి 2025న, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హిందూ సంస్థలు ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనను నిర్వహించాయి. ఆ సందర్భంగా గణేష్‌పేట్, సమీప ప్రాంతాలలో మత ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేయబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక మ్యాచ్ సందర్భంగా ఔరంగజేబు, అతని అనుచరులను ఉద్దేశించి ఒక చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమాని అభ్యంతరకరమైన భాషతో కూడిన ప్లకార్డును పట్టుకున్నాడని ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: IPL మ్యాచ్ సందర్భంగా ఔరంగజేబు, అతని అనుచరులను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషతో కూడిన ప్లకార్డును పట్టుకున్న CSK అభిమాని ఫోటో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమాని పట్టుకున్న ఒరిజినల్ ప్లకార్డ్‌లో : “The Man. The Myth. The MAHI.” అని ఉంది. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ ఫోటోని వెరిఫై చేస్తున్న సమయంలో, ఇదే ఫోటో యొక్క ఇంకో వెర్షన్ ఉన్న ఒక సోషల్ మీడియా పోస్టులో, అది ఎడిట్ చేసిన ఫోటో అయి ఉండవచ్చు అని కొందరు యూజర్లు కామెంట్ చేశారు అని మేము గమనించాము. అదనంగా, ఫోటోలో ఉన్న వారి టీ-షర్టుల పైన ఉన్న టెక్స్ట్ సరిగ్గా లేదని కూడా మేము గమనించాము. అలాగే ఈ ఫోటో యొక్క కుడి ప్రక్క కింద మూలలో Grok AI వాటర్‌మార్క్ కనిపించింది. మనం వెరిఫై చేస్తున్న ఫొటోలో కూడా కుడి పక్కన ‘AI Generated’ అని రాసి ఉండటం మనం చూడవచ్చు.

దీన్ని ధృవీకరించడానికి, మేము Sightengine అనే AI ఇమేజ్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చెక్ చేయగా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో అని అది నిర్ధారించింది.

మరింత ధృవీకరించడానికి, మేము Hive AI డిటెక్టర్‌ను ఉపయోగించాము. Hive కూడా ఇది AI ఇమేజ్ అని స్పష్టం చేసింది.

ఆ తర్వాత మేము ఈ ఫోటో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, ఒక గూగుల్ లెన్స్‌లో సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, రచయిత-దర్శకుడు రత్న కుమార్ (@mr.rathna) 24 మార్చి 2025న చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మాకు లభించింది.
ఆ పోస్ట్‌లో వైరల్ ఇమేజ్‌ని పోలిన ఫోటో ఉంది. ఈ పోస్ట్ యొక్క క్యాప్షన్ ఇలా ఉంది: “MAHI is part of my life. CSK is part of my heart. They never lost whenever I went to the ground and watched the match.” (“MAHI నా జీవితంలో భాగం. CSK నా హృదయంలో భాగం. నేను మైదానానికి వెళ్ళి మ్యాచ్ చూసినప్పుడల్లా వారు ఎప్పుడూ ఓడిపోలేదు.) కుమార్ తన అధికారిక X ఖాతాలో కూడా ఇదే ఫోటోను షేర్ చేశారు. తను పట్టుకున్న ప్లకార్డులో “The Man. The Myth. The MAHI!!,”అని రాసి ఉంది.
ఈ ఫొటోని వైరల్ ఇమేజ్‌తో పోల్చి చూస్తే, దీన్ని ఎడిట్ చేసి ఔరంగజేబ్ పోస్టర్ ఉన్న వైరల్ ఇమేజ్‌ని తయారు చేశారని మాకు అర్థం అయ్యింది. మనం సరిగ్గా గమనిస్తే, వైరల్ ఇమేజ్‌లో ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి చేతులు వింతగా ఉండటం చూడవచ్చు. అలాగే, కుమార్, అతని పక్కన ఉన్న వ్యక్తి జెర్సీలపై ఉన్న టెక్స్ట్ కూడా వింతగా ఉంది. AI- జనరేటెడ్ ఇమేజ్‌లలో ఎక్కువగా ఇలాంటి తప్పులు ఉంటాయి.

అదనంగా, రత్న కుమార్ ఈ క్లెయిముకి ఒక X పోస్ట్ ద్వారా స్పందించారు అని మాకు తెలిసింది. ఇందులో అతను వైరల్ ఇమేజ్ యొక్క మరొక వెర్షన్‌ను ఉద్దేశిస్తూ, “మీరు ఎవరు? మన దగ్గర ఉన్న అన్ని సమస్యల మధ్య… మార్ఫింగ్ ఉన్మాదులు” అని పేర్కొన్నాడు.

చివరగా, ఔరంగజేబ్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషతో కూడిన ప్లకార్డ్‌ను పట్టుకున్న CSK అభిమాని యొక్క వైరల్ ఫోటో AI ఉపయోగించి డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఇమేజ్, నిజమైనది కాదు. .