Fake News, Telugu
 

చెన్నైలో తోపుడు బండిని జేసీబీ ధ్వంసం చేస్తున్న వీడియోను, చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్ర ప్రదేశ్‌లో చోటు చేసుకున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ఒక జేసీబీ తోపుడు బండిని ధ్వంసం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తూ “చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో జేసీబీ చేత చిరు వ్యాపారుల వాహానాలను ద్వంసం చేయబడుతున్నాయి” అని రాస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో జేసీబీ చేత చిరు వ్యాపారుల వాహానాలను ధ్వంసం చేయబడుతున్న వీడియో ఇది.

ఫాక్ట్(నిజం): ఇది తమిళనాడులోని చెన్నై హైవే డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తాంబరం అనే ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించింది తొలగిస్తున్న వీడియో. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో జరగలేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్‌ను ఇండియా టుడే 30 జూన్ 2024న ప్రచురించినట్టు గమనించాం. ఈ నివేదిక ద్వారా, ఇది చెన్నైలో చోటుచేసుకుంది అని తెలుసుకున్నాం. “చెన్నై హైవే డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తాంబరంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించింది. దీంతో వీధి వ్యాపారులు అవస్థలు పడ్డారు” అని ఈ నివేదిక తెలిపింది.

దీని గురించి మరింత వెతికితే, పలు లోకల్ తమిళ న్యూస్ చానెల్లు ఈ వీడియోను ప్రచురించడం గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). పైగా ఇటువంటి ఘటన ఆంధ్ర ప్రదేశ్‌లో చేసుకున్నట్టు ఎటువంటి రిపోర్ట్ మాకు లభించలేదు.

చివరిగా, చెన్నైలో తోపుడు బండిని జేసీబీ ధ్వంసం చేస్తున్న వీడియోను, చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్ర ప్రదేశ్‌లో చోటు చేసుకున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll