Fake News, Telugu
 

వీడియోలోని వ్యక్తిని కొట్టింది ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేసినందుకు కాదు

1

ఒక ముసలాయనను కొంతమంది వ్యక్తులు  కొడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి ‘భారత్ మాతా కి జై అంటున్న ఒక వృద్ధ సర్దారుని ఈ యువకులు దారుణంగా కొడుతున్నారు, వారిని అరెస్టు చేయాలి’ అని పోస్టు చేస్తున్నారు. ఆ ఆరోపణ ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక సర్దార్ ‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు కొంతమంది వ్యక్తులు అతన్ని కొట్టిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కొట్టబడిన వ్యక్తి పేరు హోత్ చంద్ సింధీ. అతను ఒక మానసిక రోగి. భిల్వారా (రాజస్థాన్) లోని ఆజాద్ చౌక్ దగ్గర కొంతమంది వ్యాపారస్తుల నుండి డబ్బులు డిమాండ్ చేసినందుకు గానూ వారు అతన్ని కొట్టారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.  

ఆ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, దానిని ట్విట్టర్ లో కూడా వేరే ఆరోపణతో షేర్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ ద్వారా, ఆ ఘటన రాజస్థాన్ లోని భిల్వారా లో జరిగినట్లుగా తెలుస్తుంది.

దాంతో, ఆ వీడియో గురించిన సమాచారం కోసం ‘FACTLY’ వారు  భిల్వారా డిస్ట్రిక్ట్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ మీనా ని సంప్రదించినప్పుడు, ఆయన ఆ  వీడియోలో కొట్టబడిన వ్యక్తి పేరు హోత్ చంద్ సింధీ అనీ, అతనొక మానసిక రోగి అనీ, భిల్వారా లోని ఆజాద్ చౌక్ దగ్గర కొంతమంది వ్యాపారస్తుల నుండి డబ్బులు డిమాండ్ చేసినందుకు గానూ వారు అతన్ని కొట్టారని తెలిపారు. కావున, ఆ వ్యక్తిని కొట్టింది ‘భారత్ మాతా కి జై’ అని అన్నందుకు కాదు.

అంతేకాదు, ఒక ట్వీట్ కి సమాధానమిస్తూ ఢిల్లీ-రాజౌరి గార్డెన్ ఎం.ఎల్ .ఏ మంజిందర్ సిర్సా ఈ కేసు యొక్క వివరాలు ట్వీట్ చేసారు.

హోత్ చంద్ సింధీ కొడుకు ఈ ఘటన పై ఫైల్ చేసిన FIR కాపీ ‘FACTLY’ కి దొరికింది. ఆ ఫిర్యాదులో ఎక్కడా కూడా ‘భారత్ మాతా కీ జై’ నినాదం యొక్క ప్రస్తావన అసలు లేదు. అంతేకాదు, తన తండ్రిని కొట్టిన వారిలో ముస్లింలు, సింధీలు మరియు వివిధ మతం వాళ్ళు ఉన్నారని హోత్ చంద్ సింధీ కొడుకు ఫిర్యాదు ఇచ్చాడు. FIR కాపీ ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, వీడియోలోని వ్యక్తిని కొట్టింది ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేసినందుకు కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll