Fake News, Telugu
 

అమెరికా దేశపు అప్పు మాత్రమే కాదు, భారతదేశం అప్పు కూడా గత సంవత్సరం పెరిగింది

0

‘అప్పుల ఊబిలో అమెరికా…ఇంకోవైపు భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ’ అని చెప్తూ, ఒక పోస్ట్ ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అప్పుల ఊబిలో అమెరికా, ఇంకోవైపు భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ.

ఫాక్ట్: పోస్ట్ లో చెప్పినట్టు నిజంగానే అమెరికా దేశపు అప్పు 27.9 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అందులో భారత్ దగ్గర 216 బిలియన్ డాలర్లు విలువ చేసే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నాయి. అయితే, అమెరికా దేశపు అప్పు మాత్రమే కాదు, భారతదేశ అప్పు కూడా గత సంవత్సరం పెరిగింది. కావున పోస్ట్ లో ఆ వివరాలు చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అమెరికా చట్టసభ లో అలెక్స్‌ మూనీ చేసిన వ్యాఖ్యలు దొరకుతాయి. తను చట్టసభ లో 25 ఫిబ్రవరి 2021 న మాట్లాడుతూ, ‘2020 లో ఈ సమయానికి అమెరికా అప్పు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉండేది, ఇప్పుడు అది 27.9 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. చైనా మరియు జపాన్ కి ఒక్కొకరికి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా, బ్రెజిల్ కి 258 బిలియన్ డాలర్లు, మరియు భారత్ కి 216 బిలియన్ డాలర్లు అప్పు ఉన్నాము’ అని అన్నాడు.

అమెరికా దేశపు అప్పు సుమారు 27.9 ట్రిలియన్ డాలర్లు అని అమెరికా ప్రభుత్వ వెబ్సైటులో కూడా చూడవొచ్చు.

భారత్ దగ్గర 216 బిలియన్ డాలర్లు విలువ చేసే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. అయితే, ఆ లిస్టులో భారత్ పైన ఇంకా చాలా దేశాలు ఉన్నట్టు గమనించవొచ్చు.

216 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీల్లో సుమారు 183 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక (‘Long-term’) సెక్యూరిటీలు మరియు 33 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక (‘Short-term’) సెక్యూరిటీలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఆర్బీఐ కి చెందిన విదేశీ కరెన్సీ ఆస్తుల [‘Foreign Currency Assets (FCA)’] వివరాలు కింద ఫోటోలో చూడవొచ్చు.

అయితే, అమెరికా దేశపు అప్పు మాత్రమే కాదు, భారతదేశ అప్పు కూడా గత సంవత్సరం పెరిగిన్నట్టు భారత ‘ఆర్థిక సర్వే 2020-21’ డాక్యుమెంట్ లో చూడవొచ్చు. ‘Fiscal Developments’ పై ‘ఆర్థిక సర్వే 2020-21’ చెప్పిన వివరాలు ఇక్కడ చదవొచ్చు.

2020-21 సంవత్సరంలో కోవిడ్-19 ద్వారా కలిగిన పరిస్థితుల వల్ల భారతదేశ ద్రవ్య లోటు (‘Fiscal Deficit’) కూడా పెంచినట్టు ‘బడ్జెట్ 2021-22’ డాక్యుమెంట్ లో చూడవొచ్చు.

మొత్తంగా, కేంద్ర ప్రభుత్వ అప్పు 31 మార్చ్ 2020న ఒక కోటి 18 వేల లక్షలు ఉండేది. ఇది 31 మార్చ్ 2021 కి ఒక కోటి 21 లక్షల కోట్లకి, 31 మార్చ్ 2022 కి ఒక కోటి 35 లక్షల కోట్లకి పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే, రెండేళ్లలో దాదాపు 35 లక్షల కోట్ల అప్పు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.

చివరగా, అమెరికా దేశపు అప్పు మాత్రమే కాదు, భారతదేశం అప్పు కూడా గత సంవత్సరం పెరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll