Fake News, Telugu
 

ఈ వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కలేదు

0

ఈ వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది అని ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఫిజిక్స్/ ఆప్టిక్స్ ఉపయోగించి ఈ ఇల్ల్యూషన్స్ అందంగా తయారు చేసారని పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

ఫాక్ట్: వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోస్టులోని వీడియో లుయిచో కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తీసి ఎడిట్ చేసినది. లుయిచో అనే కొరియన్ కంపెనీ ఈ కప్పు సాసర్ సెట్లను డిజైన్ చేసింది. అయితే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైటులో వెతకగా, లుయిచో కంపెనీ యొక్క కప్పు సాసర్ల సెట్‌కి రికార్డు వచ్చినట్టుగా ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, స్క్రోల్ వారు 05 అక్టోబర్ 2019న  ప్రచురించిన ఆర్టికల్ లభించింది. ఈ ఆర్టికల్‌లో, వైరల్ అవుతున్న వీడియో గురించి మాట్లాడుతూ, కొరియన్ కంపెనీ లుయిచో ఈ కధలు చెప్పే రిఫ్లేక్టివ్ క్రోకరీని (కప్పు సాసర్ సెట్) తయారుచేస్తుందని తెలిపారు. ఈ వీడియో లుయిచో కంపెనీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒరిజినల్‌గా ఉందని తెలిపారు. ఆర్టికల్‌లో కప్పు సాసర్ల సెట్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చినట్టుగా లేదు.

లుయిచో కంపెనీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇటువంటి కప్పు సాసర్ల వీడియోలను మరెన్నో చూడొచ్చు. కానీ, ఇక్కడ కూడా కప్పు సాసర్ల సెట్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చినట్టుగా తెలపలేదు. లుయిచో కంపెనీ యొక్క ఫేస్బుక్ అకౌంట్‌లో కూడా దీని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

పోస్టులోని విషయం గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైటులో వెతకగా, లుయిచో కంపెనీ యొక్క కప్పు సాసర్ల సెట్‌కి రికార్డు వచ్చినట్టుగా మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు.

చివరగా, ఈ వీడియోలోని కప్పు సాసర్ సెట్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కలేదు.

Share.

About Author

Comments are closed.

scroll