Fake News, Telugu
 

టూత్ పేస్ట్ పైన ఉండే కలర్ కోడ్ దానిలోని ముడి పదార్థాలకు సూచిక కాదు

0

టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులకు అర్థం తెలుసా అంటూ వాటిపై ఉండే ఒక్కో రంగు ఎటువంటి పదార్థం యొక్క సూచనో  తెలియజేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ పోస్టుని బట్టి గ్రీన్ అంటే  నాచురల్, బ్లూ అంటే నాచురల్+మెడిసిన్, రెడ్- నాచురల్+కెమికల్, బ్లాక్- పూర్తి కెమికల్. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులు వాటిలో ఉండే ముడి పదార్థాలను సూచిస్తాయి.

ఫ్యాక్ట్ (నిజం): టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులు అందులోని ముడి పదార్థాలకి లేదా టూత్ పేస్ట్ ఫార్ములాకి సూచిక కాదు. ఈ రంగు గుర్తులు తయారీ సమయంలో సహాయపడతాయి. టూత్ పేస్ట్ ప్యాకెట్‌ని ఎక్కడ కత్తిరించాలో, మడతపెట్టాలో మరియు సీల్ చెయ్యాలో అనే విషయాలను లైట్ బీమ్ సెన్సార్లు ఈ కలర్ కొడ్‌ని స్కాన్ చేసి మెషిన్లకు అందచేస్తాయి. ఈ రంగు గుర్తులకి టూత్ పేస్ట్ ముడి పధార్థాలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పు.

అసలు పోస్టులో చెప్తున్నట్టుగా రంగు గుర్తులకి టూత్ పేస్ట్ లో ఉండే ముడి పదార్థాలకి ఏమైనా సంబంధం ఉందా అని ఇంటర్నెట్లో వెతకగా, హెల్త్ లైన్ వారు ఇదే విషయంపైన రాసిన ఒక ఆర్టికల్ లభించింది. వారి ప్రకారం, టూత్ పేస్ట్ పైన ఉండే అనేక రంగులు తయారీ సమయంలో సహాయపడతాయి.

టూత్ పేస్ట్ ప్యాకెట్‌ని ఎక్కడ కత్తిరించాలో, మడతపెట్టాలో మరియు సీల్ చెయ్యాలో అనే విషయాలను లైట్ బీమ్ సెన్సార్లు ఈ కలర్ కొడ్‌ని స్కాన్ చేసి మెషిన్లకు అందచేస్తాయి. ఈ రంగులు కేవలం బ్లూ, గ్రీన్ , బ్లాక్ మరియు రెడ్ కి మాత్రమే పరిమితం కాదు, వేర్వేరు మెషీన్లలో వాటిలోని సెన్సార్లని బట్టి అనేక విధమైన రంగులని వాడుతారు. అన్ని రంగులకి అర్థం ఒక్కటే.

ఇదే విషయంపై కోల్గేట్ వారు వివరణ ఇస్తూ, టూత్ పేస్ట్ మీద ఉన్న కలర్ కోడ్ కి, అందులోని ముడి పదార్థాలకు సంబంధం లేదని తమ వెబ్సైటులో ప్రచురించిన ఆర్టికల్ ద్వారా స్పష్టం చేసారు. టూత్ పేస్ట్ మీద ఉన్న రంగు గుర్తులు తయారీ సమయంలో సహాయపడతాయని తెలిపారు.

టూత్ పేస్ట్ ప్యాకెట్ పైన లేదా ట్యూబ్ పైన అందులోని ముడిపదార్థాల లిస్టును ముద్రిస్తారు దాని తయారీదారులు. టూత్ పేస్ట్ లోని రకాలు మరియు ముడిపదార్థాలు గురించి మరింత సమాచారం కొరకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారు రాసిన ఆర్తికల్‌ని ఇక్కడ చదవండి.

చివరిగా, టూత్ పేస్ట్ పైన ఉండే కలర్ కోడ్ దానిలోని ముడి పదార్థాలకు సూచిక కాదు.

Share.

About Author

Comments are closed.

scroll