Fake News, Telugu
 

‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అమలు చేయడం లేదు

0

“ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కింద కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. తద్వారా మీరు కుట్టు పని చేస్తూ, ఉపాధి పొందుతూ సంపాదించుకోవచ్చు. కేంద్రం అదనంగా రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తోంది” ఒక లోకల్ యాప్ కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కింద కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును బ్యాంక్ అకౌంటులో వేస్తుంది. అదనంగా కుట్టు మిషన్ షాపు పెట్టుకునేందుకు రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తోంది.

ఫాక్ట్(నిజం): ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ కింద ఎటువంటి ఉచిత కుట్టు మెషిన్ పథకం అందుబాటులో లేదు. కానీ, 18 కళలలో, కుటుంబ ఆధారిత సాంప్రదాయ వ్యాపారాలలో ఒకదానిలో నిమగ్నమై హస్తకళాకారులు ఈ పథకానికి అర్హులు. ఈ 18 కళలలో టైలరింగ్ కూడా ఒకటి. కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటులో వేయదు. కానీ, స్కిల్ అస్సెస్స్మెంట్ తర్వాత, లబ్ధిదారునికి ప్రాథమిక శిక్షణ ప్రారంభంలో e-RUPI/E-వోచర్‌ల రూపంలో రూ. 15000ల ఇన్సెంటివ్ ఇస్తుంది. వీటిని టూల్‌కిట్‌లను కొనుగోలు చేయడానికి, ప్రభుత్వం నియమించిన కేంద్రాలలో ఉపయోగించవచ్చు. లబ్ధిదారుల ప్రాథమిక ట్రైనింగ్ పూర్తయిన తరువాత కోలేటరల్ ఫ్రీ ‘ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ లోన్స్’ రూపంలో అయిదు శాతం రాయితీ వడ్డీ రేటుతో రూ. 3 లక్షల రుణం అందుబాటులో ఉంచబడుతుంది. అంతే కానీ, కేంద్రం కుట్టు మిషన్ షాపు పెట్టుకునేందుకు రూ. 20,000 వరకు రుణం ఇస్తుంది అని ఎక్కడా తెలుపలేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

PM విశ్వకర్మ యోజన గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ కింద ఎటువంటి ఉచిత కుట్టు మెషిన్ పథకం అందుబాటులో లేదు అని తెలుసుకున్నాం. అంతే కాకుండా, ‘కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అమలు చేయడం లేదని, ఇది ఫేక్ న్యూస్’ అని, PIB ఫాక్ట్ చెక్ ‘X’ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసింది.  

దీని గురించి మరింత వెతికితే,  ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ కింద, Guidelinesలో 2.3 పేరాలో పేర్కొన్న విధంగా 18 కళలలో, కుటుంబ ఆధారిత సాంప్రదాయ వ్యాపారాలలో ఒకదానిలో నిమగ్నమై, చేతులు మరియు సాధనాలతో పని చేస్తున్న హస్తకళాకారులు ఈ పథకానికి అర్హులు అని తెలుసుకున్నాం. ఈ 18 కళలలో టైలరింగ్ కూడా ఉందని మేము కనుగొన్నాము.

కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటులో వేస్తుంది అని ఎక్కడా చెప్పలేదు. కానీ, ఈ స్కీమ్ కింద లబ్దిదారుల స్కిల్ అస్సెస్స్మెంట్ తర్వాత, వారి ప్రాథమిక శిక్షణ ప్రారంభంలో e-RUPI/E-వోచర్‌ల రూపంలో రూ. 15000ల ఇన్సెంటివ్ ఇస్తుంది. ఈ వోచర్లను టూల్‌కిట్‌లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నియమించబడిన కేంద్రాలలో ఉపయోగించవచ్చు.

అంతే కాకుండా, లబ్ధిదారుల ప్రాథమిక ట్రైనింగ్ పూర్తయిన తరువాత కోలేటరల్ ఫ్రీ ‘ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ లోన్స్’ రూపంలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అర్హులైన వ్యక్తులకు అయిదు శాతం రాయితీ వడ్డీ రేటుతో రూ. 3 లక్షల రుణం అందుబాటులో ఉంచబడుతుంది. అంతే కానీ, కేంద్రం కుట్టు మిషన్ షాపు పెట్టుకునేందుకు రూ. 20,000 వరకు రుణం ఇస్తుంది అని ఎక్కడా తెలుపలేదు.

చివరిగా, ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అందించడం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll