Fake News, Telugu
 

జర్నలిస్టులను బెదిరిస్తే ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు అనలేదు

0

జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50000 జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠినకారాగార శిక్ష” అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఫాక్ట్: జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జర్నలిస్ట్ భద్రత కోసం చట్టం చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. ఈ చట్టంలో మీడియా వ్యక్తుల/ఆస్తిపై ఏదైనా హింసాత్మక చర్య జరిగితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు/లేదా నేరస్థుడికి 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారని ఉంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.          

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, సుప్రీంకోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చి ఉంటే, అన్నీ ప్రముఖ వార్తపత్రికలు ఆ తీర్పు గురించి ప్రచురించేవి. సుప్రీంకోర్టు వెబ్సైటులో కూడా వెతకగా, అలాంటి తీర్పును ఇచ్చినట్టుగా ఆధారాలు దొరకలేదు.

భారతదేశంలో జర్నలిజం వృత్తికి సంబంధించి నిర్దిష్ట ఆర్టికల్స్ అంటూ రాజ్యాంగంలో లేవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్ర్యం మరియు బావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుంది. ఆర్టికల్ 19 కు రెండవ నిబంధన కొన్ని పరిమితులను చేర్చింది; ఇవి పాత్రికేయులకు కూడా వర్తిస్తాయి.

జర్నలిస్ట్ భద్రత కోసం చట్టం చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర మీడియా పర్సన్స్ అండ్ మీడియా ఇనిస్టిట్యూషన్స్ (హింస మరియు నష్టం లేదా ఆస్తినష్టం నివారణ) చట్టం. ఇది 2017లో అసెంబ్లీలో ఆమోదించబడింది, 2019లో రాష్ట్రపతి సమ్మతిని పొందింది (మహారాష్ట్ర మీడియా పర్సన్స్ అండ్ మీడియా ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ 2017). మీడియా వ్యక్తుల/ఆస్తిపై ఏదైనా హింసాత్మక చర్య జరిగితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు/లేదా నేరస్థుడికి 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారని ఈ ఆక్ట్ చెబుతుంది.

ప్రతి జర్నలిస్ట్ కేదార్ నాథ్ సింగ్ కేసు పరంగా రక్షణ పొందడానికి అర్హత కలిగి ఉంటాడని, ఎందుకంటే ఐపిసి సెక్షన్లు 124ఎ (రాజద్రోహం) మరియు 505 (బహిరంగ అల్లరి) కింద చేసే ప్రతి ప్రాసిక్యూషన్, ఆ సెక్షన్ల పరిధికి అనుగుణంగా ఉండాలని ఇటీవల సుప్రీం కోర్ట్ ఒక కేసు విషయంలో చెప్పింది. ఇందులో, జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50000 జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష అని సుప్రీంకోర్టు అనలేదు.

చివరగా, జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50000 జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll